ఆ..మాట కోసం
ABN , Publish Date - Jun 17 , 2024 | 11:44 PM
కాలువ పనులను పట్టించుకోని వైసీపీ ప్రభుత్వంగుంతకల్లు, జూన 17: హంద్రీనీవా కాలువ వెడల్పు పనులు మరలా ప్రారంభమౌతాయని రైతులు విశ్వసిస్తు న్నారు. సాగునీటి ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు గతంలో చిత్తశుద్ధితో పనిచేశారని, ఈసారి తప్పకుండా వైడెనింగ్ పనులు పూర్తవుతాయని భావిస్తున్నారు.

ఫ హంద్రీనీవా వెడల్పు ప్రకటనపై రైతుల ఆశలు
ఫ టీడీపీ అధికారంలోకి రావడంతో అంచనాలు
ఫ కాలువ పనులను పట్టించుకోని వైసీపీ ప్రభుత్వంగుంతకల్లు, జూన 17: హంద్రీనీవా కాలువ వెడల్పు పనులు మరలా ప్రారంభమౌతాయని రైతులు విశ్వసిస్తు న్నారు. సాగునీటి ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు గతంలో చిత్తశుద్ధితో పనిచేశారని, ఈసారి తప్పకుండా వైడెనింగ్ పనులు పూర్తవుతాయని భావిస్తున్నారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైసీపీ హంద్రీనీవా కాలువ వెడల్పు పనులను పట్టించుకోలేదు. జగన ప్రభుత్వం పాత కాట్రాక్టులను రద్దుపరచడమేకాక, కొత్తగా ఎస్టిమేషన్లు, టెండర్లంటూ రెండేళ్లు మభ్యపెట్టి, చివరికి మొండిచేయి చూపింది. చంద్రబాబు ఆలోచనతో రూపుదిద్దుకున్న ఈ వైడెనింగ్ ప్రాజెక్టును ఆయనే పూర్తిచేసి వినియోగంలోకి తెస్తారని రైతులు ఆశాభావా న్ని వ్యక్తం చేస్తున్నారు.
జరగాల్సిన పనులివీ
హంద్రీనీవా వెడల్పు చేసే ప్రాజెక్టును 2017 ఏప్రిల్ 20న చంద్రబాబు నాయుడు ప్రతిపాదించారు. అందుకు సంబంధించిన పైలానను పామిడిలో ఆవిష్కరించారు. తొంభై రోజుల కాల వ్యవధి లోపలే పనులు పూర్తి కావాలని అధికారులను ఆదేశించారు. అయితే ఎస్టిమేష న్లు, టెండర్లు, అగ్రిమెంటు ప్రక్రియ కారణంగా రెండు నెలలు ఆలస్యం జరిగింది. మరో నెలకల్లా కాలువకు నీరు విడుదల కావడంతో పనులు అగిపోయాయి. నీరు నిలిచిన తర్వాత పనులు 2018లో పునఃప్రారంభం కాగా ఎన్నికల లోపు 60 శాతం అర్త్ వర్కులు పూర్తయ్యాయి. 40 శాతం మట్టిపనులు, మట్టికట్టల (బండ్) నిర్మాణ పనులు, వంతెనలు, స్లూయిజ్ చానళ్ల వద్ద కాలువలో వంద మీటర్ల మేర సిమెంటు లైనింగ్ పనులు జరగాల్సి ఉంది.
ఏటా 40 టీఎంసీల ప్రవాహమేదీ?
హంద్రీనీవా తొలి దశ పనులకు 10 టీఎంసీలు, మలి దశ పనులు పూర్తయితే గరిష్ఠంగా 40 టీఎంసీల నీరు పారేలా కాలువను డిజైన చేశారు. కాలువ బెడ్డింగ్ ప్రస్తుతం 10 మీటర్ల వెడల్పుతో ఉంది. కాలువ నిర్మాణం పూర్తయి 2013లో సాగునీటి పారుదల ప్రారంభమైన తర్వాత టీడీపీ హయాంలో 2018-19లో ఒకసారి, వైసీపీ హయాంలో 2020-21లో ఒకసారి మాత్రమే ఎత్తిపోతలు 40 టీఎంసీల మార్కును అందుకున్నాయి. టీడీపీ హయాంలో ప్రతి సంవత్సరం నీటి ఎత్తిపోతల రికార్డును పెంచుకుంటూపోగా, వైసీపీ హయాంలో 2020-21 తర్వాత ప్రతి సంవత్సరమూ నీటి ఎత్తిపోతలు తగ్గుతూ వచ్చాయి. గత సీజనలో దాదాపు 22 టీఎంసీలను మాత్రమే ఇవ్వగలిగారు. కాలువ గరిష్ఠ సామర్థ్యం 40 టీఎంసీల నుంచి రెండింతలు చేయడానికి తొలిదశ కాలువ కింద ఉన్న 216 కి.మీ.ల కాలవను వెడల్పు చేయడానికి చంద్రబాబు సంకల్పించారు. తద్వారా తొలిదశ కాలువకు, జీడిపల్లి రిజర్వాయరు ఎగువన ఉన్న రెండో దశ కాలువకు ఒకేసారి సాగు, తాగునీరు అందించడానికి సాధ్యపడుతుంది. కానీ పరిస్థితుల ప్రభావం వల్ల ఆ బృహత్కార్యం మధ్యలోనే ఆగిపోయింది. ఇప్పుడు ప్రభుత్వం మారడం వైడెనింగ్ పనుల పునఃప్రారంభంపై రైతులు ఆశలు పెంచుకున్నారు.
వైడెనింగ్ ప్రకటన కోసం ఎదురుచూపు
ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన రోజునే ఇరిగేషన ప్రాజెక్టులపై ప్రసంగం చేస్తారని, అందులో వివిధ పాలసీ విషయాలుగా ఆయన మాట్లాడుతారని, హంద్రీనీవా కాలువ వెడల్పుపై ఆయన తప్పక విధానాన్ని ప్రకటిస్తారని రైతులు ఎదురుచూశారు. కానీ ఎటువంటి ప్రసంగం చేయకపోవడంతో త్వరలో వైడెనింగ్ విషయంగా చంద్రబాబు ప్రభుత్వం తప్పక ప్రకటన చేస్తుందన్న ఆశతో రైతులు ఉన్నారు. త్వరలో హంద్రీనీవాకు సాగునీరు విడుదల అవుతున్న తరుణంగా కనీసం ఫిబ్రవరికల్లా వైడెనింగ్ కార్యక్రమంపై కార్యాచరణ జరిగితే ఎత్తిపోతలు ఆగిన తర్వాత పనులు ప్రారంభం అవుతాయని, వచ్చే సీజనకల్లా వైడెనింగ్ కల సాకారమౌతుందని భావిస్తున్నారు. వైడెనింగ్ పనుల కారణంగా హంద్రీనీవా కాలువలో ఎటువంటి అభివృద్ధి పనులూ చేపట్టడంలేదు. దీనివల్ల కాలవలో నిర్మించిన మట్టికట్టలు శిథిలమౌతూ, కెనాల్‌లోకి జారిపోతున్నాయి. వైడెనింగ్ ప్రారంభమైతే కాలువ పటిష్టం అవుతుందని రైతులు చెబుతున్నారు.