Share News

rain: పుట్టపర్తిలో కుండపోత

ABN , Publish Date - May 19 , 2024 | 12:35 AM

జిల్లాకేంద్రమైన పుట్టపర్తి పట్టణంలో శనివారం కుండపోత వర్షం కురిసింది. దాదాపు గంటపాటు ఎడతెరపి లే కుండా కురవడంతో వీధులన్నీ జలమయమయ్యాయి.

 rain: పుట్టపర్తిలో కుండపోత
పుట్టపర్తిలో రోడ్డుపై పారుతున్న వర్షపునీరు

-చల్లబడిన వాతావరణం -ఉక్కపోత నుంచి ఉపశమనం పొందిన జనం

పుట్టపర్తి రూరల్‌ మే 18: జిల్లాకేంద్రమైన పుట్టపర్తి పట్టణంలో శనివారం కుండపోత వర్షం కురిసింది. దాదాపు గంటపాటు ఎడతెరపి లే కుండా కురవడంతో వీధులన్నీ జలమయమయ్యాయి.


వర్షపునీరు భారీ గా రోడ్లపైకి చేరడంతో పాదచారులు, ద్విచక్రవాహనాదులు కాస్తా ఇబ్బందులు పడ్డారు. వర్షం రాకతో వాతావరణం చల్లబడింది. గత మూడు నె లలుగా ఎండవేడిమితో విలవిల్లాడుతున్న ప్రజలు ఉపశమనం పొందా రు. ముఖ్యంగా వర్షం రాకతో రైతన్నల మోములో ఆనందం వెల్లివిరిసింది.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....


Updated Date - May 19 , 2024 | 12:35 AM