Share News

టీవీ రిపేరీ దుకాణంలో అగ్నిప్రమాదం

ABN , Publish Date - Mar 26 , 2024 | 11:49 PM

స్థానిక రైల్వే స్టేషన సమీపంలో ఉన్న టీవీల రిపేరీ దుకాణం బాలాజీ ఎలక్ర్టానిక్స్‌లో మంగళవారం అగ్నిప్రమాదం జరిగింది.

టీవీ రిపేరీ దుకాణంలో అగ్నిప్రమాదం
మంటలను అదుపు చేస్తున్న అగ్నిమాపక సిబ్బంది

అనంతపురం న్యూటౌన, మార్చి 26: స్థానిక రైల్వే స్టేషన సమీపంలో ఉన్న టీవీల రిపేరీ దుకాణం బాలాజీ ఎలక్ర్టానిక్స్‌లో మంగళవారం అగ్నిప్రమాదం జరిగింది. వెంటనే అగ్నిమాపక శాఖ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో ఆ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలు చుట్టుపక్కల దుకాణాలను వ్యాపించకుండా అదుపు చేశారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పినట్లు అయింది. కాగా, దుకాణంలో రూ.2 లక్షల వరకు ఆస్థి నష్టం ఉంటుందని జిల్లా అసిస్టెంట్‌ అగ్నిమాపక శాఖాధికారి లింగమయ్య తెలిపారు. షార్ట్‌ సర్య్కూట్‌ వల్లే ఈ అగ్నిప్రమాదం చోటు చేసుకుందని షాపు యజమాని శేషుఫణి తెలిపారు. ఈ కార్యక్రమంలో అగ్నిమాపక శాఖ సిబ్బంది క్రిష్ణకుమార్‌, రాఘవేంద్ర, రమేష్‌, శివతేజ, పీఎస్‌ నాయుడు పాల్గొన్నారు.

Updated Date - Mar 26 , 2024 | 11:49 PM