Share News

ఫైళ్లు ఎప్పటికప్పుడు క్లియర్‌ కావాలి

ABN , Publish Date - Jun 11 , 2024 | 12:18 AM

ప్రతి ఫైల్‌ను వెంటనే పరిశీలించి క్లియర్‌ చేయాలని కలెక్టరు వినోద్‌ కుమార్‌ కలెక్టరేట్‌ అధికారులు, ఉద్యోగులకు ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని ఏ,బీ,సీ,డీ,ఈ సెక్షనలతో పాటు రికార్డు రూమ్స్‌, కేఆర్సీసీ రూమ్‌, భూసంస్కరణల కార్యాలయాన్ని కలెక్ట రు ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఫైళ్లు ఎప్పటికప్పుడు క్లియర్‌ కావాలి
కలెక్టరేట్‌లో పెండింగ్‌ ఫైల్స్‌పై సిబ్బంది వద్ద ఆరా తీస్తున్న కలెక్టరు వినోద్‌ కుమార్‌, అసిస్టెంట్‌ కలెక్టరు వినూత్న

అనంతపురం టౌన, జూన 10: ప్రతి ఫైల్‌ను వెంటనే పరిశీలించి క్లియర్‌ చేయాలని కలెక్టరు వినోద్‌ కుమార్‌ కలెక్టరేట్‌ అధికారులు, ఉద్యోగులకు ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని ఏ,బీ,సీ,డీ,ఈ సెక్షనలతో పాటు రికార్డు రూమ్స్‌, కేఆర్సీసీ రూమ్‌, భూసంస్కరణల కార్యాలయాన్ని కలెక్ట రు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రతి విభాగంలోకి వెళ్లి అక్కడ ఎంతమంది పనిచేస్తున్నారు.. ఎవరెవరు పనిచేస్తు న్నారు... అందులో ఎంతమంది డ్యూటీకి వచ్చారు.. పెం డింగ్‌ రికార్డులు ఎన్ని ఉన్నాయ్‌... తదితర వాటిపై ఆరా తీశారు. అనంతరం కలెక్టరు కలెక్టరేట్‌ అధికారులు, సిబ్బం దిని ఉద్దేశించి మాట్లాడుతూ... ఫైళ్ల నిర్వహణ విషయంలో ఎక్కడా నిర్లక్ష్యం చేయకూడ దన్నారు. ఎప్పటికపుడు పరిశీ లించి వాటిని పెండింగ్‌ లేకుండా క్లియర్‌ చేయాలని సూ చించారు. కలెక్టరేట్‌ ఉద్యోగులందరు తప్పనిసరిగా ఐడీ కార్డులు ధరించి డ్యూటీకి హాజరు కావాల న్నారు.


సమ యపాలన విధిగా పాటించాలని ఆదేశించారు. ఆర్టీఐ, ఎస్టీ ఎస్టీ కమిషన నుంచి వచ్చిన ఫైల్స్‌, కారుణ్య నియా మకాలకు సంబంధించిన ఫైల్స్‌ వెంటనే పరిష్కరిం చాలని సూచించారు. ఎనహెచ 544కు సంబంధించి చాలా సమ స్యలు వస్తున్నాయని, వాటిని కరెక్ట్‌గా కరెక్షన చేయాలని అన్నారు. భూసంస్కరణల కార్యాలయాన్ని కలెక్టరేట్‌ సెక్షన లోకి మార్పు చేయాలని, కలెక్టరేట్‌కు ఐఎస్‌ ఓ సర్టిఫికెట్‌ కోసం దరకాస్తు చేయాలని ఏఓకు కలెక్టరు ఆదేశించారు. కార్యక్రమంలో అసిస్టెంట్‌ కలెక్టరు బొల్లినేని వినూత్న, ఇనచార్జ్‌ డీఆర్‌ఓ ఆనంద్‌, ఏఓ అంజనబాబు పాల్గొన్నారు.

Updated Date - Jun 11 , 2024 | 12:18 AM