Share News

వైసీపీ ప్రభుత్వంపై విసిగిపోయారు

ABN , Publish Date - Jan 07 , 2024 | 01:09 AM

రాష్ట్ర ప్రజలు వైసీపీ ప్రభుత్వంపై విసిగిపోయారని, మరో నాలుగు నెలల్లో జగన ప్రభుత్వానికి చరమగీతం పాడి, అందరూ మెచ్చే టీడీపీ ప్రభుత్వాన్ని ఎన్నుకోనున్నారని మాజీ మంత్రి పరిటాల సునీత అన్నారు. అనంతపురంలోని తన నివాసంలో శనివారం ఆమె విలేకరులతో మాట్లాడారు.

వైసీపీ ప్రభుత్వంపై విసిగిపోయారు

నాలుగు నెలల్లో జగన ప్రభుత్వానికి చరమగీతం

మాజీ మంత్రిపరిటాల సునీత

అనంతపురం, జనవరి 6(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రజలు వైసీపీ ప్రభుత్వంపై విసిగిపోయారని, మరో నాలుగు నెలల్లో జగన ప్రభుత్వానికి చరమగీతం పాడి, అందరూ మెచ్చే టీడీపీ ప్రభుత్వాన్ని ఎన్నుకోనున్నారని మాజీ మంత్రి పరిటాల సునీత అన్నారు. అనంతపురంలోని తన నివాసంలో శనివారం ఆమె విలేకరులతో మాట్లాడారు. వైసీపీ పాలనలో ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారని, ఇలాంటి ప్రభుత్వాన్ని ఎన్నడూ చూడలేదని అన్నారు. ఓట్లు వేసి గెలిపించిన ప్రజలను బంధించి, బాధించిన ఏకైక ప్రభుత్వం వైసీపీదేనని అన్నారు. తమ పార్టీ అధినేత చంద్రబాబు చేపట్టిన ‘రా కదలిరా’ సభలకు వస్తున్న జనవాహిని చూసి తాడేపల్లి ప్యాలెస్‌ పునాదులు కదిలిపోతున్నాయని అన్నారు. చంద్రబాబును అక్రమంగా జైల్లో పెట్టడమే కాకుండా ఆయనపై వైసీపీ నాయకులు చేసిన దూషణలపై ప్రజలు ఆగ్రహంగా ఉన్నారన్నారు. దళితులు, బీసీలు జగన పాలనలో అత్యధికంగా హింసకు గురయ్యారన్నారు. ఆ వర్గాలపై అక్రమ కేసులు బనాయించి ఇబ్బందులకు గురి చేశారన్నారు. టీడీపీ తీసుకొచ్చిన మేనిఫెస్టోపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. మహిళలు, రైతులు, నిరుద్యోగ యువతకు మేనిఫెస్టోలో చంద్రబాబు పెద్ద పీట వేశారని, బీసీ రక్షణ చట్టాన్ని తీసుకొస్తామని హామీ ఇవ్వడం ఆ వర్గాల్లో మరింత భరోసా నింపిందన్నారు. రాష్ట్రమంతా వైసీపీ వ్యతిరేక గాలి వీస్తోందని, రానున్న ఎన్నికల్లో వైసీపీ 175 సీట్లు గెలవడం కాదని, ఆ పార్టీ అన్ని చోట్ల ఓడిపోవాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. సమావేశంలో కురుబ సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్‌ గంగలకుంట రమణ, పార్టీ కన్వీనర్‌ గంతి శ్రీనివాసులు, జింకా సూర్యనారాయణ, పంపు కొండప్ప, రాగే పరశురాం, రాగే మురళీ, లక్ష్మినారాయణ పాల్గొన్నారు.

Updated Date - Jan 07 , 2024 | 01:09 AM