Share News

farmers: అడంగల్‌ కోసం రైతుల అగచాట్లు

ABN , Publish Date - Jun 11 , 2024 | 12:25 AM

మండలంలో రైతులు బ్యాంకుల్లో పంట రుణాల రెన్యువల్‌కు అవసరమైన 1బీ, అడంగల్‌ కోసం తీవ్ర ఇబ్బందు లు పడుతున్నారు. వాటిని జారీ చేయాల్సిన సచివాలయ సిబ్బంది సక్రమంగా ఇవ్వకపోవడంతో నానా అగచాట్లు పడుతున్నారు. గ్రామాల్లో సచివాలయ సిబ్బంది సకాలంలో సక్రమంగా విధులకు రాకపోగా, 1బీ, అడంగల్‌ సర్టిఫికెట్లు అందించడానికి సర్వర్లు, ప్రింటర్లు పనిచేయడం లేదని చెబుతున్నారు.

farmers: అడంగల్‌ కోసం రైతుల అగచాట్లు
Farmers waiting for Adangal at the Secretariat

గుమ్మఘట్ట, జూన 10: మండలంలో రైతులు బ్యాంకుల్లో పంట రుణాల రెన్యువల్‌కు అవసరమైన 1బీ, అడంగల్‌ కోసం తీవ్ర ఇబ్బందు లు పడుతున్నారు. వాటిని జారీ చేయాల్సిన సచివాలయ సిబ్బంది సక్రమంగా ఇవ్వకపోవడంతో నానా అగచాట్లు పడుతున్నారు. గ్రామాల్లో సచివాలయ సిబ్బంది సకాలంలో సక్రమంగా విధులకు రాకపోగా, 1బీ, అడంగల్‌ సర్టిఫికెట్లు అందించడానికి సర్వర్లు, ప్రింటర్లు పనిచేయడం లేదని చెబుతున్నారు. దీంతో రైతులు బ్యాంకుల్లో రుణాలను రెన్యువల్‌ చేయడానికి ఇబ్బందులు పడుతున్నట్లు వాపోతు న్నారు. సోమవారం గుమ్మఘట్ట మండల కేంద్రంలోని సచివాలయం వద్ద 1బీ, అడంగల్‌ కోసం వందలాది మంది రైతులు వేచి ఉన్నారు. మండల కేంద్రంలోని సచివాలయంలో మాత్రమే సర్వర్‌ పని చేస్తుండటంతో 1బీ, అడంగల్‌ సర్టిఫికెట్లను తీసుకునేందుకు వివిధ గ్రామాల రైతులు సచివాలయం వద్ద బారులు తీరారు. ప్రతి గ్రామంలో సచివాలయం ఉన్నప్పటికీ సిబ్బంది పనిచేయకపోవడం దారుణమని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - Jun 11 , 2024 | 12:25 AM