Share News

వైసీపీలో ఓటమి భయం

ABN , Publish Date - Feb 07 , 2024 | 12:36 AM

రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కాంగ్రె్‌సపై చేసిన వ్యాఖ్యలు సరికాదని, ఓటమి భయంతోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జంగా గౌతమ్‌ అన్నారు. ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు శంకర్‌తో కలిసి డీసీసీ కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. రాజ్యసభలో విజయసాయిరెడ్డి అవివేకంతో మాట్లాడినట్లు ఉందని అన్నారు.

వైసీపీలో ఓటమి భయం
మాట్లాడుతున్న కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ గౌతమ్‌

కాంగ్రెస్‌ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ గౌతమ్‌

అనంతపురం న్యూటౌన, ఫిబ్రవరి 6: రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కాంగ్రె్‌సపై చేసిన వ్యాఖ్యలు సరికాదని, ఓటమి భయంతోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జంగా గౌతమ్‌ అన్నారు. ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు శంకర్‌తో కలిసి డీసీసీ కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. రాజ్యసభలో విజయసాయిరెడ్డి అవివేకంతో మాట్లాడినట్లు ఉందని అన్నారు. బీజేపీకి తొత్తుగా మారిన వైసీపీ.. బీజేపీ-2 గా మారిందని రాష్ట్ర ప్రజలకు తెలుసునని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ చట్టం చేయనందుకే ఏపీకి ప్రత్యేక హోదా రాలేదని బీజేపీకి మద్దతుగా వైసీపీ నాయకులు మాట్లాడటాన్ని వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని అన్నారు. ప్రత్యేక హోదా అమలుకు చట్టం చేయాల్సిన అవసరం లేదని, కేంద్ర కేబినెట్‌ ఆమోదం సరిపోతుందని అన్నారు. దీనిపై 2014 మార్చిలోనే కేబినేట్‌ నిర్ణయం జరిగిందని గుర్తు చేశారు. కాంగ్రెస్‌ పార్టీ రాషా్ట్రన్ని అడ్డంగా విభజించిందని జగన అంటున్నారని, వైఎస్సార్‌ సమాది సాక్షిగా 2012, డిసెంబరు 28న రాష్ట్ర విభజనకు అనుకూలంగా జగన లేఖ రాయలేదా అని ప్రశ్నించారు. రాజ్యసభలో సాయిరెడ్డి వ్యాఖ్యలను చూస్తుంటే వైసీపీకి ఓటమి భయం పట్టుకున్నట్లు స్పష్టమౌతోందని అన్నారు. ఓడిపోయే ముందైనా నిజాలు మాట్లాడాలని హితవు పలికారు. పూర్తి పేరు చెప్పుకోలేని వైసీపీ ఒక దొంగ పార్టీ అని అన్నారు. కాంగ్రెస్‌ గురించి మాట్లాడే అర్హత ఆ పార్టీ నాయకులకు లేదని అన్నారు. వైసీపీ అధినేత జగన మొదట ఏ పార్టీ నుంచి ఎంపీ అయ్యారో మరువకూడదని అన్నారు. ప్రాంతీయ పార్టీల్లో దేనికి ఓటు వేసినా బీజేపీకి వేసినట్లే అని అన్నారు. బీజేపీతో పోరాటం చేసి రాష్ట్ర హక్కులను కాపాడుకోలేనివారు కాంగ్రె్‌సపై మాత్రం విమర్శలు చేస్తారు అని ఎద్దేవా చేశారు. వైసీపీ నాయకులకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.

Updated Date - Feb 07 , 2024 | 12:36 AM