జీన్స పరిశ్రమను కణేకల్లుకు విస్తరిస్తాం: కాలవ
ABN , Publish Date - Mar 18 , 2024 | 11:22 PM
రాయదుర్గంలో అభివృద్ధి చెందిన జీన్స పరిశ్రమను కణేకల్లుకు విస్తరిస్తామని మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు హామీ ఇచ్చారు.
కణేకల్లు, మార్చి 18: రాయదుర్గంలో అభివృద్ధి చెందిన జీన్స పరిశ్రమను కణేకల్లుకు విస్తరిస్తామని మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు హామీ ఇచ్చారు. సోమవారం ఆయన కణేకల్లులోని సంజయ్‌నగర్‌లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించి ఇంటింటికి వెళ్లి తనకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అత్యధికంగా ముస్లిం మైనార్టీలున్న కణేకల్లులో గతంలో షాదీఖానా మంజూరు చేయించడమే కాకుండా రోడ్డు వెడల్పు కూడా చేయించామన్నారు. తుంగభద్ర ఎగువ కాలువ నీటి సమస్యను ఏ రైతు ఎదుర్కోకుండా తన హయాంలో చేశానన్నారు. అందరికీ అండగా ఉండి సక్రమంగా నీరు అందించేందుకు ఏర్పాట్లు చేశానన్నారు. భవిష్యత్తులో ఉపాధి అవకాశాలు మెరుగు పరచడానికి కృషి చేస్తానన్నారు. ఉచితంగా కుట్టుమిషన్లు అందించడమే కాకుండా స్కిల్ డెవలప్ మెంట్ ద్వారా నైపుణ్యాన్ని పెంచి జీవనోపాధిని మెరుగు పరుస్తానన్నారు. కణేకల్లు పంచాయతీలో రెండువేలకుపైగా మెజార్టీ సాధిస్తామన్నారు. కార ్యక్రమంలో టీడీపీ నాయకులు లాలెప్ప, ఆనంద్‌రాజ్, వేలూరు మరియప్ప, కళేకుర్తి సుదర్శన, బీటీ రమేష్, ఎస్‌కే మల్లికార్జున, షేక్‌ముజ్జు, బాయినేని నవీన, మాబుసాబ్, చాంద్‌బాషా, కురుబ నాగరాజు, చంద్రశేఖర్‌గుప్తా, అనిల్, వెంకటేశులు, శ్రీకాంత, కిషోర్, జలంధర్‌రెడ్డి, జయశీలారెడ్డి, మారుతి, సక్లైన, నరేష్, కృష్ణారెడ్డి, సూరి, అంజిబాబు, ఎల్లప్ప, ఆంజినేయులు, ప్రకాష్, వరుణ్, జనసేన నాయకులు రవి, రామ్ పాల్గొన్నారు.