Share News

happy: ప్రమాదం తర్వాత ప్రమోదం

ABN , Publish Date - Aug 24 , 2024 | 11:56 PM

తుంగభద్ర జలాశయం నీటితో మళ్లీ కళకళలాడుతోంది. టీబీ డ్యాం అధికారులు శనివారం లెక్కలు వేసే సమయానికి 85.113 టీఎంసీల నీరు చేరింది. ఇనఫ్లో నిలకడగా ఉంటోంది. డ్యాం పూర్తిగా నిండిన తర్వాత ఈనెల 10న డ్యాం క్రస్ట్‌ గేటు కొట్టుకుపోయిన నేపథ్యంలో నీటిని నదికి మళ్లించిన విషయం తెలిసిందే.

happy: ప్రమాదం తర్వాత ప్రమోదం
Tungabhadra Reservoir brimming with water

మళ్లీ నిండుతున్న తుంగభద్ర జలాశయం

బళ్లారి, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి): తుంగభద్ర జలాశయం నీటితో మళ్లీ కళకళలాడుతోంది. టీబీ డ్యాం అధికారులు శనివారం లెక్కలు వేసే సమయానికి 85.113 టీఎంసీల నీరు చేరింది. ఇనఫ్లో నిలకడగా ఉంటోంది. డ్యాం పూర్తిగా నిండిన తర్వాత ఈనెల 10న డ్యాం క్రస్ట్‌ గేటు కొట్టుకుపోయిన నేపథ్యంలో నీటిని నదికి మళ్లించిన విషయం తెలిసిందే. క్రస్ట్‌ గేటు స్థానంలో తాత్కాలికంగా స్టాప్‌లాగ్‌ ఎలిమెంట్‌ అమర్చారు. 70 టీఎంసీల నీటి నుంచి ఇప్పుడు 85.113 టీఎంసీల నీరు చేరాయి. ఈ ఆరురోజుల్లోనే దాదాపు 15 టీఎంసీల నీరు డ్యాంలోకి చేరాయి. డ్యాం పై భాగంలో వర్షాలు బాగా కురుస్తున్నాయి. డ్యాంలో 85 టీఎంసీల నీరు చేరడంతో రైతుల్లోనూ, ఆధికారుల్లో ఆనందం వ్యక్తం అవుతుంది. ఖరీఫ్‌, రబీకి మూడు రాష్ట్రాలతో పాటు గ్రామాలకు తాగునీరు కూడా ఇబ్బంది ఉండదని అధికారులు అభిప్రాయపడుతున్నారు.

Updated Date - Aug 24 , 2024 | 11:56 PM