ఫ్రీహోల్డ్ భూముల పరిశీలన
ABN , Publish Date - Aug 24 , 2024 | 12:52 AM
మండలంలో ఫ్రీహోల్డ్ భూములను సీసీఎల్‌ఏ అదనపు కమిషనర్ ప్రభాకర్‌రెడ్డి శుక్రవారం పరిశీలించారు.
బత్తలపల్లి ఆగస్టు 23 : మండలంలో ఫ్రీహోల్డ్ భూములను సీసీఎల్‌ఏ అదనపు కమిషనర్ ప్రభాకర్‌రెడ్డి శుక్రవారం పరిశీలించారు. పోట్లమర్రి గ్రామం వద్ద సర్వే నంబరు 392-2లోని ఫ్రీహోల్డ్ భూమిని ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. భూమి కొనుగోలుపై సంబంధికులను విచారించారు. వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయనికి వెళ్లి, రికార్డులను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. మండలవ్యాప్తంగా ఫ్రీహోల్డ్ భూములను ఎవరైనా అక్రమంగా రిజిస్ట్రేషన చేయించుకుని ఉండుంటే బాధితులు ఫిర్య్యాదు చేయవచ్చన్నారు. కార్యక్రమంలో జేసీ అభిషేక్ కుమార్, ఆర్డీఓ వెంకటశివరామిరెడ్డి, తహసీల్దార్ నటరాజన, వీఆర్వోలు పాల్గొన్నారు.