Share News

మూడేళ్లయినా తప్పని తిప్పలు..!

ABN , Publish Date - May 22 , 2024 | 12:37 AM

మండలంలోని కక్కలపల్లి, రుద్రంపేట ప్రధా న రహదారులు అధ్వాన స్థితిలో ఉన్నాయి. మూడేళ్లుగా రుద్రంపేట ప్రధాన రోడ్డు నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి.

మూడేళ్లయినా తప్పని తిప్పలు..!
గుంతలమైపోయిన కక్కలపల్లి టమోటా మార్కెట్‌ రోడ్డు

అనంతపురంరూరల్‌, మే 21: మండలంలోని కక్కలపల్లి, రుద్రంపేట ప్రధా న రహదారులు అధ్వాన స్థితిలో ఉన్నాయి. మూడేళ్లుగా రుద్రంపేట ప్రధాన రోడ్డు నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. నేటికీ ఆ రోడ్డు నిర్మాణం మాత్రం పూర్తి కాలేదు. దీంతో రుద్రంపేట సర్కిల్‌ నుంచి పీవీకేకే ఇంజినీ రింగ్‌ కళాశాల వరకు ఉన్న ఆలమూరు రోడ్డు ప్రయాణికుల సహనాన్ని పరీక్షిస్తోంది. గాయిత్రి మిల్క్‌ డైరీ సమీ పంలో రోడ్డు మరి అధ్వానంగా ఉంది. రోడ్డుపై పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. పక్కన వైపు నుంచి వెళ్దామన్నా.. రోడ్డు నిర్మాణం కోసం తోలిన కంకర అడ్డుగా ఉంది.


దీంతో ప్రయాణికుల కష్టాలు వర్ణనాతీతం. సోమవారం రాత్రి కురిసిన వర్షానికి ఆ రోడ్డు మరింత అధ్వానం గా తయారైంది. ఈ ప్రయాణ కష్టాలు ఎప్పటికీ తీరెనో అంటూ ప్రయాణి కులు వాపోతున్నా రు. ఇక కక్కలపల్లి క్రాస్‌ నుంచి కక్కలపల్లి గ్రామానికి వెళ్లే రోడ్డు కూడా ఇదే విధంగా ఉంది. రోడ్డు మొత్తం దెబ్బతింది. టమోటా మార్కెట్‌ ప్రధాన రోడ్డంతా పెద్ద.. పెద్ద.. గుంతలున్నాయి. నిత్యం పెద్ద పెద్ద వాహనాలు వచ్చి.. పోతుండటంతో గుంతలు ఏర్పడ్డాయి. అయినా వీటి గురించి పట్టిం చుకునే నాథులే కరువయ్యారు. ఈ రోడ్లపై ప్రయా ణం చేయాలంటే ఒళ్లు హూనం అవుతోందని ప్రయాణికులు వాపోతున్నారు. రోడ్డు ఎప్పుడేస్తారో.. ఈ సమస్య ఎప్పటికీ తీరెనో అని మండిపడుతున్నారు.

Updated Date - May 22 , 2024 | 12:37 AM