Share News

పరిశ్రమల స్థాపన టీడీపీతోనే సాధ్యం

ABN , Publish Date - Apr 25 , 2024 | 11:49 PM

పరిశ్రమల స్థాపన టీడీపీతోనే సాధ్యమని అనంత అర్బన కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గుబాటి వెంకటేశ్వరప్రసాద్‌ పేర్కొన్నారు.

పరిశ్రమల స్థాపన టీడీపీతోనే సాధ్యం
Daggubati Prasad with those who joined in TDP

అనంతపురం అర్బన / అనంతపురంరూరల్‌, ఏప్రిల్‌ 25: పరిశ్రమల స్థాపన టీడీపీతోనే సాధ్యమని అనంత అర్బన కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గుబాటి వెంకటేశ్వరప్రసాద్‌ పేర్కొన్నారు. గురువారం స్థానిక సాయినగర్‌లో నిరుద్యోగ జేఏసీ చైర్మన షేక్‌ సిద్దిక్‌ ఆధ్వర్యంలో చేపట్టిన నిరుద్యోగ చైతన్య యాత్రను ఆయన ప్రారంభించారు. ఆ కమిటీ సభ్యులతో కలిసి కరపత్రాలు ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ... వైసీపీ ఐదేళ్ల పాలనలో జిల్లాకు ఎన్ని పరిశ్రమలు వచ్చాయో ఎమ్మెల్యే సమాధానం చెప్పాలని నిలదీశారు. అనేక మంది ఉన్నత చదువులు చదివినా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక మహానగరాలకు వలసలు వెళుతున్నారన్నారు. సామాన్య ప్రజలు సైతం హైదరాబాద్‌, బెంగుళూరుకు వెళ్లి బతకాల్సిన దుస్థితిని ఎదుర్కొంటున్నా రన్నారు. జిల్లాకు వచ్చిన పరిశ్రమలను వెల్లగొట్టి పేదలకు ఉపాధి అవకాశా లు లేకుండా చేశారన్నారు. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు మళ్లీ సీఎం అయితేనే రాష్ర్టానికి అన్ని విధాలా న్యాయం జరుగుతుందన్నారు. తనను గెలిపిస్తే.. అధికారంలోకి రాగానే చంద్రబాబు సహకారంతో ఎస్‌ఈజెడ్‌లు ఏర్పాటు చేసి పరిశ్రమలు తీసుకొచ్చి, నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. యువత, మేధావులు, అన్ని వర్గాల ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని కోరారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్‌ చైర్మన నూర్‌ మహ్మద్‌, నాయకులు సరిపూటి రమణ, బల్లా పల్ల వి, సైఫుద్దీన, లక్ష్మీనరసింహ, ఓబుల్‌రెడ్డి, పూలబాషా పాల్గొన్నారు.


టీడీపీలోకి చేరికలు

వైసీపీ నుంచి పలువురు స్వచ్చందంగా టీడీపీలో చేరారు. గురువారం దగ్గుబాటి ప్రసాద్‌ సమక్షంలో వారంతా టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. కురుబ యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బండి కాశీ విశ్వనాథ్‌ ఆధ్వర్యంలో 300 మంది కురబ కులస్ధులు టీడీపీలో చేరారు. అలాగే సున్నపుగేరిలో బోయపాటి రమణ, రాగే శ్రీనివాసులు ఆధ్వర్యంలో సిద్దారెడ్డి, పవన, షామీర్‌, శివశంకర్‌లతోపాటు 200 మంది టీడీపీలో చేరారు. తపోవనంలో బళ్లారి చలపతి, బళ్లారి గోవిందు, బళ్లారి సుధాకర్‌, రామకృష్ణ, ఈశ్వరయ్య, శ్రీనివాసులు, లీలావతి, రూప, మనోజ్‌, అభిషేక్‌, రత్నమ్మ, అశోక్‌లతో పాటు మరో వంద మంది పార్టీలో చే రారు. వీరికి దగ్గుబాటి ప్రసాద్‌ పార్టీ కండువా కప్పి సాదరంగా టీడీపీలోకి ఆహ్వానించారు. వైసీపీ కోసం ఎంతో చేశామని, కానీ తమకు ఎలాంటి గుర్తింపు, ప్రయోజనం లేదని, చంద్రబాబు, దగ్గుబాటి ప్రసాద్‌ నాయకత్వాన్ని సమర్థిస్తూ తాము టీడీపీలో చేరినట్లు వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా దగ్గుబాటి ప్రసాద్‌ మాట్లాడుతూ... కురబలతోపాటు అన్ని వర్గాల ప్రజలు టీడీపీవైపే ఉన్నారన్నారు. టీడీపీలో చేరిన నాయకులు, కార్యకర్తలకు తగిన ప్రాధాన్యత ఇస్తామన్నారు. ఇంకా ఎవరైనా పార్టీలోకి రావాలనుకుంటే ధైర్యంగా రావొచ్చున్నారు. కార్యక్రమంలో బ్యాళ్ల నాగేంద్ర, రమేష్‌, రమణ, కురబ నారాయణస్వామి, రాజగోపాల్‌, బోరంపల్లి ఆంజినేయులు, రాకేష్‌, నాగరాజు, రాయల్‌ సందీప్‌, గోపాల్‌ పాల్గొన్నారు.


దగ్గుబాటి శ్రీలక్ష్మి ప్రచారం

దగ్గుబాటి ప్రసాద్‌ సతీమణి దగ్గుబాటి శ్రీ లక్ష్మీ అనంతపురం నగరంలోని 27వ డివిజన, రెండో డివిజన పరిధిలోని ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి సూపర్‌ సిక్స్‌ పథకాల కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సరిపూటి రమణ, సరిపూటి శ్రీకాంత, బల్లాపల్లవి, గుర్రం నాగభూషణం, కంఠాదేవి, దబ్బర వెంకటేష్‌, పూల బాషా, రజాక్‌, కృష్ణవేణి, భాస్కర్‌, శివాజీ, పీరా, భగవాన పాల్గొన్నారు.


మరిన్ని వార్తల కోసం...

Updated Date - Apr 25 , 2024 | 11:49 PM