Share News

ఉత్సాహంగా ఉట్ల పరుష

ABN , Publish Date - Apr 18 , 2024 | 12:07 AM

శ్రీరామనవమిని పురస్కరించుకొని పట్టణ పరిధిలోని సూగూరు ఆయంజనేయస్వామి దేవాలయ ప్రాంగణం, దండురోడ్డులోని బైలాంజనేయా ఆలయ ప్రాంగణంలో ఉట్లపరుష కోలాహలంగా జరిగింది.

ఉత్సాహంగా ఉట్ల పరుష
సూగూరులో ఉట్లపరుషకు హాజరైన జనం

హిందూపురం అర్బన, ఏప్రిల్‌ 17: శ్రీరామనవమిని పురస్కరించుకొని పట్టణ పరిధిలోని సూగూరు ఆయంజనేయస్వామి దేవాలయ ప్రాంగణం, దండురోడ్డులోని బైలాంజనేయా ఆలయ ప్రాంగణంలో ఉట్లపరుష కోలాహలంగా జరిగింది. రెండు గంటల పాటు హోరాహోరీగా ఉట్లమాను ఎక్కడానికి యువత పోటీపడ్డారు. వేలాది మంది ప్రజలు ఉట్లమాను పరుషను తిలకించడానికి తరలివచ్చారు.

పెనుకొండ రూరల్‌ : శ్రీరామనవమి పండగను పురస్కరించుకుని మండలంలోని పెద్దచెరువుకట్ట ఆంజనేయస్వామి ఆలయంలో ఉట్లపరుషను ఘనంగా నిర్వహించారు. ఆనవాయితీ ప్రకారం కురుబవాండ్లపల్లికి చెందిన తలారులు ముందుగా గ్రామంలోని రామాలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి నీటి కుండతో ఆంజనేయస్వామి ఆల యానికి చేరుకున్నారు. ప్రత్యేక పూజలు చేసి ఉట్లను కడుతారు. గ్రామానికి చెందిన త లారులు ఉట్టికొట్టే కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యక్రమాన్ని తిలకించేందుకు పెనుకొండ తో పాటు చుట్టు పక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. అలాగే మండలంలోని మంగాపురంలో గ్రామస్థులు ఉట్టికొట్టే కార్యక్రమం నిర్వహించారు.

Updated Date - Apr 18 , 2024 | 12:07 AM