Share News

శత్రువులు.. ఒక్కటయ్యారు..

ABN , Publish Date - Apr 19 , 2024 | 12:22 AM

మండలకేంద్రమైన చిలమత్తూరుకు చెందిన వైసీపీ సీనియర్‌ నాయకుడు నాగరాజు యాదవ్‌, టీడీపీలోని మాజీ సర్పంచ అశ్వర్థప్ప, మాజీ కన్వీనర్‌ నందీషప్ప మధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్గుమనే రీతిలో 20 ఏళ్లుగా రాజకీయ శత్రుత్వం ఉండేది.

శత్రువులు.. ఒక్కటయ్యారు..
నాగరాజుయాదవ్‌ ఇంట్లో సమావేశమైన టీడీపీ నాయకులు

చిలమత్తూరు, ఏప్రిల్‌ 18: మండలకేంద్రమైన చిలమత్తూరుకు చెందిన వైసీపీ సీనియర్‌ నాయకుడు నాగరాజు యాదవ్‌, టీడీపీలోని మాజీ సర్పంచ అశ్వర్థప్ప, మాజీ కన్వీనర్‌ నందీషప్ప మధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్గుమనే రీతిలో 20 ఏళ్లుగా రాజకీయ శత్రుత్వం ఉండేది. అలాంటి వారు ఏకమయ్యారు. సోదరుడు లక్ష్మీనారాయణ యాదవ్‌తో కలిసి నాగరాజు యాదవ్‌ టీడీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సమక్షంలో శుక్రవారం పసుపు కండువా కప్పుకోనున్నారు. ఈ నేపథ్యంలో అశ్వత్థప్ప, నందీషప్ప ఇళ్లకు నాగరాజు వెళ్లారు. బాలయ్య గెలుపునకు సమష్టిగా పనిచేద్దామని కోరారు. దీంతో వారు ఏకీభవించి, కోఆర్డినేటర్‌ శ్రీనివాసరావుతో కలిసి నాగరాజు యాదవ్‌ ఇంటికి భోజనానికి వెళ్లారు. దీంతో 20 ఏళ్లుగా ఉన్న శత్రుత్వం సమసిపోయింది. కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ హిందూపురం నియోజకవర్గ కోఆర్డినేటర్‌ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. బాలకృష్ణ విజయానికి సమష్టిగా పనిచేద్దామని పిలుపునిచ్చారు.

Updated Date - Apr 19 , 2024 | 12:22 AM