Share News

ఎక్స్‌కవేటర్‌తో ఉపాధి పనులు

ABN , Publish Date - Jan 12 , 2024 | 12:24 AM

ఉపాధి హామీ పథకం ద్వారా కూలీలతో చేయించాల్సిన పనులను అధికార పార్టీ నాయకులు ఎక్స్‌క వేటర్‌తో చేయించి.. నిధులను స్వాహా చేస్తు న్నారు

ఎక్స్‌కవేటర్‌తో ఉపాధి పనులు
ఎక్స్‌కవేటర్‌తో ఉపాధి పనులు చేస్తున్న దృశ్యం

కూలీల కడుపుకొడుతున్న అధికార పార్టీ నాయకులు

ధర్మవరంరూరల్‌, జనవరి 11: ఉపాధి హామీ పథకం ద్వారా కూలీలతో చేయించాల్సిన పనులను అధికార పార్టీ నాయకులు ఎక్స్‌క వేటర్‌తో చేయించి.. నిధులను స్వాహా చేస్తు న్నారు. కనగానపల్లి మండలం మామిళ్లపల్లిలో ఉపాధి పథకం కింద ఫారంపాండ్‌ పనులను అధికార పార్టీ నాయకులు అధికారులతో కుమ్మక్కై ఎక్స్‌కవేటర్‌తో చేయిస్తున్నారు. గురు వారం మామిళ్లపల్లి గ్రామ సమీపంలో కొండ్రెడ్డిబావికి వెళ్లే సమీపంలో పెద్దవంకలో ఈ పనులు చేపట్టారు. వారం రోజులు చేయాల్సిన పనులను ఒకేరోజు యంత్రాలతో చేయించి.. కూలీలకు రావాల్సిన సొమ్మును స్వాహా చేసి నట్లు సమాచారం. ఉపాధి హామీ పనులను ఎక్స్‌కవేటర్‌తో చేయిస్తున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. దీనిపై ఫోనలో ఏపీఓ వెంకటేష్‌నాయక్‌ వివరణకు ప్రయ త్నించగా.. ఆయన అందుబాటులోకి రాలేదు.

Updated Date - Jan 12 , 2024 | 12:24 AM