Share News

టీడీపీతోనే ఉపాధి అవకాశాలు

ABN , Publish Date - Apr 17 , 2024 | 12:03 AM

రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధి అవకాశాలు మెరుగుపడాలంటే టీడీపీ అధికారంలోకి రావాలని, చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని టీడీపీ కూటమి ఎంపీ అభ్యర్థి బీకే పార్థసారఽథి, ఎమ్మెల్యే అభ్యర్థి సవిత పేర్కొన్నారు.

 టీడీపీతోనే ఉపాధి అవకాశాలు
మలసముద్రం ఎన్నికల ప్రచారంలో కూటమి అభ్యర్థులు పార్థసారఽథి, సవిత

కూటమి అభ్యర్థులు బీకే, సవిత

గోరంట్ల, ఏప్రిల్‌ 16: రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధి అవకాశాలు మెరుగుపడాలంటే టీడీపీ అధికారంలోకి రావాలని, చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని టీడీపీ కూటమి ఎంపీ అభ్యర్థి బీకే పార్థసారఽథి, ఎమ్మెల్యే అభ్యర్థి సవిత పేర్కొన్నారు. వారు మంగళవా రం మండలంలోని మలసముద్రం పంచాయతీ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వ హించారు. ఇంటింటికెళ్లి కరపత్రాలు పంచి, సూపర్‌ సిక్స్‌పథకాల గురించి వివరించా రు. చంద్రబాబు కృషి వల్లనే జిల్లాకు కియ, నాసిన, బెల్‌, నిషా గార్మెంట్స్‌ పరిశ్రమలు వచ్చాయన్నారు. వాటికి అనుబంధంగా అనేక పరిశ్రమలు రావడానికి సిద్ధంగా ఉండగా వైసీపీ ప్రభుత్వం జే ట్యాక్స్‌కు భయపడి వెనక్కు వెళ్లాయన్నారు. అక్రమాల వైసీపీని సాగనంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. మలసముద్రం పంచాయతీలో తాగునీటి సమస్య, సీసీరోడ్లు, కోరేవాండ్లపల్లిలో శ్మశానవాటిక సమస్యలను పరిష్కరిస్తా మన్నారు. ఎంపీ అభ్యర్థి బీకే పార్థసారథి, తాను నిరంతరం నియోజకవర్గ ప్రజల వె న్నటి ఉండి అభివృద్ధికి చేస్తామని ఇరువురి తరపున హామీ ఇస్తున్నట్లు సవిత తెలిపా రు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు కొల్లకుంట ఆంజనప్ప, రాష్ట్ర వడ్డెర సాధికారి త కన్వీనర్‌ వడ్డెవెంకట్‌, మండల కన్వీనర్‌ సోముశేఖర్‌, సర్పంచ సువర్ణ, అశ్వ త్థరెడ్డి, నిమ్మల యువశేఖర్‌, రామచంద్రారెడ్డి, అమరనాథ్‌రెడ్డి, కమలాకర్‌రెడ్డి, బాబురె డ్డి, బాలక్రిష్ణ, రంగయ్య, దేవాగం క్రిష్టప్ప, జనసేన, బీజేపీ నాయకులు తదితరులు న్నారు.

బీజేపీ నాయకుల మద్దతు : బీజేపీ మండల నాయకులు ుంగళవారం గోరంట్ల లోని టీడీపీ కార్యాలయంలో కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి సవితను కలిశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురందేశ్వరి, జిల్లా అధ్యక్షుడు జీఎం శేఖర్‌ ఆదేశాలతో సవిత గెలుపుకోసం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. బీజేపీ నాయకులు ఈశ్వర్‌రెడ్డి, మేదర శ్రీనివాసులు, శంకర్‌రెడ్డి, ముంతాజమ్మ, లక్ష్మీదేవి, గంగాధర్‌, శంకర్‌, షబ్బీర్‌, నరసింహు లు, హరీష్‌, వెంకటాచలం, అశోక్‌, ఆంజ నేయులు, నరేష్‌ తదితరులు పాల్గొన్నారు.

టీడీపీలోకి పలువురి చేరిక

గోరంట్ల: మండలంలోని గుట్టిపల్లికి చెందిన 20 కుటుంబాలు మంగళవారం వైసీపీనుంచి టీడీపీలోకి చేరారు. గోరంట్లలోని పార్టీకార్యాలయంలో పెనుకొండ టీడీపీ కూటమి అభ్యర్థి సవిత కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. చేరినవారిలో గుట్టిపల్లికి చెందిన మీసాల ఈశ్వరయ్య, లక్ష్మీనారాయణరెడ్డి, వెంక టశివారెడ్డి, నరసింహారెడ్డి, రాజారెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, హరినాథ్‌రెడ్డి, నర్సిరెడ్డి, రామ చంద్ర, నేసే సిద్ధప్ప, కురుమాల గంగులప్ప, జంగం నాగమణి, లక్ష్మీపతి, విష్ణు, రాఘవేంద్ర, లక్ష్మీనారాయణ, ఎస్‌వి రమణ తదితరులున్నారు అలాగే రెడ్డిచెరువులపల్లి పంచాయతీ ఉపసర్పంచ నరసింహులు, బెల్లాలచెరువు నారాయణప్ప టీడీపీలో చేరారు.

పెనుకొండ టౌన: మండలంలోని మునిమడుగు గ్రామం నుంచి 25కుటుంబాలు

మంగళవారం వైసీపీ నుంచి టీడీపీలోకి చేరాయి. చేరిన వారిలో దాసరి వెంకటప్ప, కెఆర్‌ వెంకటరాముడు, డీ శంకర్‌, పెన్నక్క, ఆంజనేయులు, సూరప్ప, శ్రీరాములు, ఆంజనేయులు తదితరులు ఉన్నారు. అలాగే గోనిపేట నుంచి వలంటీరు అశ్వత్థరెడ్డితో పాటు పూజితారెడ్డి, నాగమ్మ, నవీనరెడ్డి, విజయభాస్కర్‌రెడ్డి, సౌజన్య, శాంతిబాయి, రమేష్‌నాయక్‌, వెంకటరెడ్డి తదితరులు చేరారు. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సవిత పట్టణంలోని పార్టీ కార్యాలయంలో వారికి కండువాలువేసి ఆహ్వానించారు.

Updated Date - Apr 17 , 2024 | 12:03 AM