Share News

ఉద్యోగుల సమస్యల్ని వెంటనే పరిష్కరించాలి

ABN , Publish Date - Mar 01 , 2024 | 12:19 AM

పుట్టపర్తిరూరల్‌, ఫిబ్రవరి 29 : ఉపాధ్యాయులు, ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఏపీటీఎఫ్‌ జిల్లా ప్రధానకార్యదర్శి ఆర్‌ చంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

ఉద్యోగుల సమస్యల్ని వెంటనే పరిష్కరించాలి

- ఏపీటీఎఫ్‌ డిమాండ్‌

పుట్టపర్తిరూరల్‌, ఫిబ్రవరి 29 : ఉపాధ్యాయులు, ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఏపీటీఎఫ్‌ జిల్లా ప్రధానకార్యదర్శి ఆర్‌ చంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు పట్టణంలోని తహసీల్దార్‌ కార్యాలయంలో గురువారం ఆయన సీనియర్‌ అసిస్టెంట్‌ బాబాకు వినతి పత్రం అందజేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం ఉపాధ్యాయులు, ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యలను పరిష్కరించడంలో తీవ్రజాప్యం చేస్తోందన్నారు. ఉద్యోగ ఉపాధ్యాయులకు ప్రయోజనాలను పొందటంలో కూడా ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. 12వ పీఆర్సీ మధ్యంతర భృతి 30శాతం తక్షణమే చెల్లించాలన్నారు. 11వ పీఆర్సీ బకాయిలను విడతల వారీగా కాకుండా.. ఒకేసారి చెల్లించాలన్నారు. పెండింగ్‌లో ఉన్న రెండు కొత్త డీఏలను తక్షణమే విడుదల చేయలన్నారు. సీపీఎస్‌ రద్దుచేసి వారి డీఏల మొత్తాన్ని 90శాతం క్యాష్‌రూపంలో చెల్లించాలన్నారు. మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు చెల్లించాలన్నారు. పెన్సనర్ల అడిషనల్‌ క్వాంటమ్‌ ఆఫ్‌ పెన్షన 70నుంచి 75 సంవత్సరాల వయసు మధ్యవారికి 10శాతం, 75నుంచి 80 ఏళ్ల మధ్యవారికి 15శాతం మంజూరు చేయాలన్నారు. టీచర్ల నియామకంలో మళ్లీ ప్రవేశపెట్టిన అప్రెంటీస్‌ విధానాన్ని రద్దుచేసి రెగ్యులర్‌ స్కేల్‌లో నియమించాలన్నారు. ఉద్యోగుల, ఉపాధ్యాయిల పెన్షనర్ల అన్నిరకాల పెండింగ్‌ సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. లేకపోతే మళ్ళీ ఉద్యమాలను చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ప్రధానకార్యదర్శితో పాటు పుట్టపర్తి, బుక్కపట్నం, కొత్తచెరువు మండలాల అధ్యక్షకార్యదర్శులు రాజశేఖర్‌, జయరాం, ఈశ్వరప్ప, కృష్ణమూర్తి, శంకర్‌నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 01 , 2024 | 12:19 AM