Share News

EMPLOYEES: ఓపీఎస్‌ కోసం అలుపెరగని పోరాటం

ABN , Publish Date - May 21 , 2024 | 12:11 AM

కేంద్ర ప్రభుత్వం ఓపీఎ్‌స(పాత పింఛను విధానాన్ని)ను పునరుద్ధరించేదాకా పోరాటాన్ని ఆపరాదని ఆలిండియా ఆర్‌ఎంఎస్‌, ఎంఎంఎస్‌ ఎంప్లాయీస్‌ యూనియన నాయకులు డిమాండ్‌ చేశారు. సోమవారం ఉదయం పట్టణంలోని రైల్వే ఇనస్టిట్యూట్‌లో సంఘ ద్వైవార్షిక సర్కిల్‌ కాన్ఫరెన్సను ప్రారంభించారు.

EMPLOYEES: ఓపీఎస్‌ కోసం అలుపెరగని పోరాటం
Pradeep U Khadse speaking in the meeting

ఆలిండియా ఆర్‌ఎంఎస్‌, ఎంఎంఎస్‌ ఎంప్లాయీస్‌ యూనియన

గుంతకల్లు, మే20: కేంద్ర ప్రభుత్వం ఓపీఎ్‌స(పాత పింఛను విధానాన్ని)ను పునరుద్ధరించేదాకా పోరాటాన్ని ఆపరాదని ఆలిండియా ఆర్‌ఎంఎస్‌, ఎంఎంఎస్‌ ఎంప్లాయీస్‌ యూనియన నాయకులు డిమాండ్‌ చేశారు. సోమవారం ఉదయం పట్టణంలోని రైల్వే ఇనస్టిట్యూట్‌లో సంఘ ద్వైవార్షిక సర్కిల్‌ కాన్ఫరెన్సను ప్రారంభించారు. కార్యక్రమానికి ముఖ్య వక్తగా విచ్చేసిన ఆర్‌ఎంఎస్‌, ఎంఎంఎస్‌ సంఘ నాయకులు మాట్లాడుతూ యూనియన ఆధ్వర్యంలో ఆర్‌ఎంఎస్‌, ఎంఎంఎస్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, కొత్త పింఛను రద్దు, పాత పింఛను విధానం పునరుద్ధరించడానికి అలుపెరుగని పోరాటాలు సాగించాలన్నారు. గుంతకల్లు డివిజన హెడ్‌ క్వార్టర్సులోని రైల్వే మెయిల్‌ సర్వీస్‌ ప్రాధాన్యతను తగ్గించే కార్యక్రమాలను చేపడుతున్నారన్నారు. ఉద్యోగులు సమష్టిగా వీటిపై పోరాడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఆర్‌-3 ప్రధాన కార్యదర్శి ప్రదీప్‌ యూ ఖడ్సే ఆర్‌-4 ప్రధాన కార్యదర్శి కే ముక్తార్‌ అహ్మద్‌, ఆర్‌-3 సర్కిల్‌ అధ్యక్షుడు పీవీ రావు, కార్యదర్శి మృదుల, నాయకులు సురేశ, బి. రామాంజనేయులు, మధుసూదనరావు, కోటేశ్వరరావు, పి. శ్రీధర్‌ బాబు పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం..

Updated Date - May 21 , 2024 | 12:11 AM