Share News

ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

ABN , Publish Date - Mar 01 , 2024 | 12:04 AM

రాష్ట్రప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఏపీటీఎఫ్‌ నాయకులు డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం నూతనంగా ప్రకటించిన అప్రెంటీస్‌ విధానాన్ని రద్దు చేయాల్సిందే అన్నారు.

ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి
పెనుకొండలో మాట్లాడుతున్న ఏపీటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు

ఏపీటీఎఫ్‌ నాయకుల డిమాండ్‌

హిందూపురం అర్బన, ఫిబ్రవరి 29: రాష్ట్రప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఏపీటీఎఫ్‌ నాయకులు డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం నూతనంగా ప్రకటించిన అప్రెంటీస్‌ విధానాన్ని రద్దు చేయాల్సిందే అన్నారు. ఈ మేరకు గురువారం సాయంత్రం స్థానిక తహసీల్దార్‌ కార్యాలయం వద్ద నిరసన తెలిపి డిప్యూటీ తహసీల్దార్‌ వెంకటేశకు వినతిపత్రం అందించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ... ఇప్పుడు నూతనంగా డీఎస్సీలో ఎంపికైన వారికి అప్రెంటీస్‌ పెట్టడం ఏంటని ఆగ్రహించారు. దానిని రద్దు చేయాల్సిందే అని పట్టుబట్టారు. కార్యక్రమంలో ఏపీటీఎఫ్‌ జిల్లా కార్యదర్శి అంజనమూర్తి, రాష్ట్ర కౌన్సిలర్‌ రాందాస్‌ నాయక్‌, సీనియర్‌ నాయకులు గురురాజారావు, వెంకటరమణ తదితరులు ఉన్నారు.

పెనుకొండ : రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సమస్యలు పరిష్కరించడంలో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని, వెంటనే పరిష్కరించాలని ఏపీటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు కోడూరు శ్రీనివాసులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఏపీటీఎఫ్‌ మండల అధ్యక్షుడు గోపాల్‌ ఆధ్వర్యంలో స్థానిక సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం ఎదుట ఏపీటీఎఫ్‌ ఆధ్వర్యంలో గురువారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా శ్రీనివాసులు మాట్లాడుతూ... వైసీపీ అధికారంలోకి వచ్చి ఐదేళ్లవు తున్నా ఏ ఒక్క సమస్యనుపరిష్కరించకపోగా కొత్త సమస్యలు సృష్టిస్తున్నార న్నారు. తమ సమస్యలను పరిష్కరించనిపక్షంలో పెద్దఎత్తున ఉద్యమాలు చేపడతామన్నారు. కార్యక్రమంలో ఏపీటీఎఫ్‌ ఆడిట్‌ కమిటీ సభ్యుడు కరణం రఘునాథ్‌రావు, జువాజి నాగరాజు, చంద్రశేఖర్‌గౌడ్‌, వెంకటరమణనాయక్‌, ఆంజనేయులు, చంద్రశేఖర్‌, నారప్పరెడ్డి, రుద్రేష్‌, రంగేష్‌ కుమార్‌, శ్రీనివాసు లు, ఆంజనేయులు, శివయ్య, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

మడకశిరటౌన: ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలంటూ ఏపీటీఎఫ్‌ నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఏపీటీఎఫ్‌ ఆధ్వర్యంలో గురువారం మడకశిర తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట సమస్యలు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరి స్తోందని మండిపడ్డారు. పెండింగ్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలన్నార. పాత పెన్షన విధానాన్ని పునరుద్ధరించాలని, ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి జగనమోహనరెడ్డి ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. అనంతరం తహసీల్దార్‌ వెంకటేశకు వినతి పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో ఏపీటీఎఫ్‌ జిల్లా కార్యదర్శి లతా రామకృష్ణ, నాయకులు యంజారప్ప, నాగరాజు, జయరామరెడ్డి, ప్రశాంత, సత్యనారాయణ, రామకృష్ణ, రమే్‌షబాబు, రవి, సోమశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 01 , 2024 | 12:04 AM