Share News

ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

ABN , Publish Date - Feb 15 , 2024 | 12:45 AM

కదిరిఅర్బన, ఫిబ్రవరి 14: రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ బుధవారం ఉద్యోగ జేఏసీ పిలుపు మేరకు పట్టణంలోని నాయకులు స్థానిక తహసీల్దార్‌ కా ర్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు.

ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

కదిరిఅర్బన, ఫిబ్రవరి 14: రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ బుధవారం ఉద్యోగ జేఏసీ పిలుపు మేరకు పట్టణంలోని నాయకులు స్థానిక తహసీల్దార్‌ కా ర్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. జేఏసీ చైర్మన వేణుగోపాల్‌రెడ్డి మాట్లాడు తూ.. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్లకు ఐఆర్‌ 30శాతం ప్రకటించాలని, పెడింగ్‌లో ఉన్న ఆర్థిక బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్‌ చేయాలన్నారు. కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ విధానం రద్దు చేయాలన్నారు. సీపీఎ్‌సరద్దు చేసి.. పాత పింఛన విధానాన్ని పునరుద్ధరించాలన్నారు. పెన్షనర్లకు 1వతేదీనే జీతలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలన్నారు. యూటీఎఫ్‌, పెన్షనర్ల సంఘం, ఎన్జీఓ నాయకులు శ్రీనివాసులు, ఆత్మారెడ్డి, శివారెడి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 15 , 2024 | 12:45 AM