Share News

అర్హులు ఓటు హక్కును వినియోగించుకోవాలి: కలెక్టర్‌

ABN , Publish Date - Jan 12 , 2024 | 12:39 AM

పుట్టపర్తి, జనవరి 11: అర్హత ఉన్న ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకులానే అధికారులు చూడాలని కలెక్టర్‌ అరుణ్‌బాబు సూచించారు. పట్టణంలోని కలెక్టరేట్‌లో గురువారం ఆయన జిల్లాస్థాయి, అసెంబ్లీస్థాయి మాస్టార్‌ ట్రైనర్లతో సమావేశం నిర్వహించి మాట్లాడారు.

అర్హులు ఓటు హక్కును వినియోగించుకోవాలి: కలెక్టర్‌

పుట్టపర్తి, జనవరి 11: అర్హత ఉన్న ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకులానే అధికారులు చూడాలని కలెక్టర్‌ అరుణ్‌బాబు సూచించారు. పట్టణంలోని కలెక్టరేట్‌లో గురువారం ఆయన జిల్లాస్థాయి, అసెంబ్లీస్థాయి మాస్టార్‌ ట్రైనర్లతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. డిజిటల్‌ రంగంలో వస్తున్న మార్పునకు అనుగుణంగా ఎన్నికల ప్రకియలో మార్పులు తీసుకురావడం జరిగిందన్నారు. ఈవీఎంలపై ఓటర్లకు నమ్మకం కలిగేలా అవగాహన కల్పించాలన్నారు. స్వీప్‌ ఆధ్వర్యంలో అవగాహన విసృతం చేయాలన్నారు. త్వరలో లోక్‌సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయని, వాటి నిర్వహణకు దాదాపు 12వేల మంది సిబ్బందిని నియమించడానికి చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. మాస్టార్‌ ట్రైనర్లు ఆయా నియోజకవర్గాలో పీఓలు, ఏపీఓలకు శిక్షణ ఇవ్వాలన్నారు. జిల్లాలో 1560కేంద్రాలు గుర్తించడం జరిగింది. ఆయాకేంద్రాల్లో అవసరమైన ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో జేసీ అభిషేక్‌ కుమార్‌, డీఆర్వో కొండయ్య, పెనుకొండ సబ్‌కలెక్టర్‌ అపూర్వ భరత, ఆర్డీవోలు వంశీకృష్ణ, భాగ్యరేఖ, రమే్‌షరెడ్డి, మున్సిపల్‌ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 12 , 2024 | 12:39 AM