Share News

ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలి

ABN , Publish Date - Apr 05 , 2024 | 12:29 AM

రాబోయే సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా నిష్పక్ష పాతంగా జరగాలని జిల్లా కలెక్టర్‌ అరుణ్‌బాబు, ఎన్నికల సిబ్బందికి సూచించారు. ఎన్నికల విధుల్లో ఎవరికీ ఎలాంటి మినహాయింపు ఉండదని విధినిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలి
శిక్షణా తరగతుల్లో మాట్లాడుతున్న కలెక్టర్‌ అరుణ్‌బాబు

నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు: కలెక్టర్‌ అరుణ్‌బాబు

పెనుకొండ, ఏప్రిల్‌ 4 : రాబోయే సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా నిష్పక్ష పాతంగా జరగాలని జిల్లా కలెక్టర్‌ అరుణ్‌బాబు, ఎన్నికల సిబ్బందికి సూచించారు. ఎన్నికల విధుల్లో ఎవరికీ ఎలాంటి మినహాయింపు ఉండదని విధినిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పెనుకొండ జూనియర్‌ కళాశాల విన్సెంట్‌ఫెర్రర్‌ ఆడిటోరియంలో గురువారం పెనుకొండ నియోజకవ ర్గం ఎన్నికల పీఓలు, ఏపీఓలకు శిక్షణా తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్ర మానికి హాజరైన జిల్లా కలెక్టర్‌ అరుణ్‌బాబు మాట్లాడుతూ... ఎన్నికల ప్రక్రియ లో పీఓ, ఏపీఓల పాత్ర కీలకమన్నారు. ఎన్నికలు నిష్పక్షపాతంగా ప్రశాంత వాతావ రణంలో జరిగేలా ఎన్నికల విధులను సక్రమంగా నిర్వహించాలన్నారు. ఎన్నికల విధులకు ఎలాంటి మినహాయింపు ఉండదన్నారు. మే 13న హిందూపు రం పార్లమెంట్‌, ఆరు శాసనసభ స్థానాలకు జరుగనున్న ఎన్నికల్లో విధులు నిర్వ హిస్తున్న పీఓ, ఏపీఓలు శిక్షణా తరగతులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. విధి నిర్వహణలో ఎలాంటి సందేహాలున్నా వాటిని శిక్షణా తరగతుల్లో మాస్టర్‌ ట్రైనీల ద్వారా నివృత్తి చేసుకోవాలన్నారు. అనంతరం పోలింగ్‌ నిర్వహణకు సంబంధించి అధికారులకు అవగాహన కల్పిస్తూ పలు అంశాలపై సూచనలు అందించారు. అనంతరం పీఓలు, ఏపీఓలకు ఈవీఎం బాక్సులపై అవగాహ న కల్పించారు. కార్యక్రమంలో పెనుకొండ రిటర్నింగ్‌ అధికారి సబ్‌ కలెక్టర్‌ అపూర్వభరత, మునిసిపల్‌ కమిషనర్‌ వంశీకృష్ణ భార్గవ్‌, నియోజకవర్గానికి చెందిన తహసీల్దార్‌లు, పీఓలు, ఏపీఓలు, మాస్టర్‌ ట్రైనీలు పాల్గొన్నారు.

Updated Date - Apr 05 , 2024 | 12:29 AM