Share News

రేపట్నుంచి ఎన్నికల ప్రచారం

ABN , Publish Date - Apr 16 , 2024 | 11:24 PM

ఎన్నికల ప్రచారానికి గురువారం నుంచి శ్రీకారం చుడుతున్నట్లు మాజీ మంత్రి పరిటాల సునీత పేర్కొన్నారు.

రేపట్నుంచి ఎన్నికల ప్రచారం
సమావేశంలో మాట్లాడుతున్న పరిటాల సునీత

రామగిరి, ఏప్రిల్‌ 16: ఎన్నికల ప్రచారానికి గురువారం నుంచి శ్రీకారం చుడుతున్నట్లు మాజీ మంత్రి పరిటాల సునీత పేర్కొన్నారు. ముత్తవకుంట్ల, తల్లిమడుగుల గ్రామాల టీడీపీ ముఖ్య నాయకులతో మంగళవారం వెంకటా పురంలో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. సెంటిమెంట్‌ ప్రకారం ప్రతి ఎన్నికల్లో పరిటాల రవీంద్ర హయాం నుంచి కనగానపల్లి మండలం ముత్తవకుంట్ల నుంచి ప్రచారాన్ని ప్రారంభిస్తున్నామని, ఈ సారీ అదే గ్రామం నుంచి ప్రచారాన్ని ప్రారంభిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.

వైసీపీ నుంచి టీడీపీలోకి పలువురి చేరిక

ఆంధ్రజ్యోతి, న్యూస్‌ నెట్‌వర్క్‌ : రాప్తాడు నియోజకవర్గంలో వైసీపీ నుంచి టీడీపీలోకి పలువురు వార్డు మెంబర్లు కార్యకర్తలు చేరారు. ఆత్మకూరు మండలం పంపనూరు తండాకి చెందిన పంచాయతీ వార్డు మెంబర్లు లక్ష్మిదేవి, వెంకటేష్‌ నాయక్‌, రాప్తాడు, అనంతపురం రూరల్‌, చెన్నేకొత్తపల్లి మండలాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున అనంతపురంలోని క్యాంపు కార్యాలయంలో పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్‌ల ఆధ్వర్యంలో టీడీపీలోకి చేరారు. అనంతపురంరూరల్‌ మండలం కందుకూరు గ్రామానికి చెందిన వైసీపీ సీనియర్‌ నాయకుడు చంద్రశేఖర్‌రెడ్డి టీడీపీలో చేరారు. పార్టీలోకి చేరిన వారందరికి కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. పార్టీలోకి చేరిన ప్రతి ఒక్కరికి సముచిత స్థానం కల్పిస్తామన్నారు. కొత్త, పాత అన్న తేడా లేకుండా కలిసికట్టుగా పనిచేయాలన్నారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా తాము ఉన్నామని... పార్టీ విజయం కోసం ప్రతిఒక్కరూ కష్టపడి పనిచేయాలన్నారు. పార్టీలోకి చేరిన వారిలో రాప్తాడు గ్రామానికి చెందిన తలారీ శివ, మాజీ సర్పంచ మాన్లుకోసే రామాంజనేయులు కుమారుడు మాన్లుకోసే కేశవ, చెన్నేకొత్తపల్లి మండలం బసంపల్లి గ్రామానికి చెందిన నగేష్‌, కొండయ్య, చెన్నకేశవులు, ప్యాదిండి గ్రామానికి చెందిన ఓబుళపతి, లక్ష్మిపతి, నారాయణ, కుళ్లాయప్ప, దుర్గప్ప, పంపనూరు తండాకు చెందిన లక్ష్మినారాయణ, ప్రశాంత నాయక్‌, రమేష్‌ నాయక్‌, రామకృష్ణ నాయక్‌, అనంతపురం రూరల్‌ మండలం కందుకూరు గ్రామానికి చెందిన చంద్రశేఖర్‌రెడ్డి ఉన్నారు.

Updated Date - Apr 16 , 2024 | 11:24 PM