Share News

TDP: గ్రామాల అభివృద్ధికి కృషి: గుమ్మనూరు

ABN , Publish Date - Apr 24 , 2024 | 11:51 PM

అధికారంలోకి రాగానే గ్రామాలన్నీ అభివృద్ధి చేస్తానని గుంతకల్లు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గుమ్మనూరు జయరాం అన్నారు. బుధవారం మండలంలోని జక్కలచెరువు, గాజులపల్లి, ఇసురాళ్లపల్లిలో ఆయన ప్రచారం నిర్వహించారు. ఆయన మాట్లడుతూ చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా చేస్తే రాష్ట్రం బాగుంటుందన్నారు.

TDP: గ్రామాల అభివృద్ధికి కృషి: గుమ్మనూరు
గాజులపల్లిలో మాట్లడుతున్న గుమ్మనూరు జయరాం

గుత్తిరూరల్‌, ఏప్రిల్‌ 24: అధికారంలోకి రాగానే గ్రామాలన్నీ అభివృద్ధి చేస్తానని గుంతకల్లు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గుమ్మనూరు జయరాం అన్నారు. బుధవారం మండలంలోని జక్కలచెరువు, గాజులపల్లి, ఇసురాళ్లపల్లిలో ఆయన ప్రచారం నిర్వహించారు. ఆయన మాట్లడుతూ చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా చేస్తే రాష్ట్రం బాగుంటుందన్నారు. ప్రతి ఒక్కరూ సైకిల్‌ గుర్తుకు ఓటువేసి గెలుపించాలన్నారు. కార్యక్రమంలో మండల కన్వీనర్‌ బర్దివలి, కేసీ హరి చిన్నరెడ్డి యాదవ్‌, గుమ్మనూరు నారాయణ, హిమబిందు, సర్పంచ భరత, ఎంపీటీసీ జింకల నారాయణస్వామి, లక్ష్మినారాయణమ్మ, రంగారెడ్డి యాదవ్‌, గోవర్ధన గౌడ్‌, సుధీర్‌ గౌడ్‌, వెంకటనారాయణ, రామాంజునేయులు, శివశంకర్‌, సాంబశివ, రవితేజ నారాయణస్వామి ఏంకే చౌదరి, ప్రతాప్‌, గోవిందు, లక్ష్మిరంగయ్య పాల్గొన్నారు.


జయరాంను గెలిపించండి

గుంతకల్లు: టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గుమ్మనూరు జయరాంను అఖండ మెజారిటీతో గెలిపించాలని ఆయన సోదరులు గుమ్మనూరు శ్రీనివాసులు, నారాయణ స్వామి ప్రచారం నిర్వహించారు. పట్టణంలోని 29, 30 వార్డుల్లో ఇంటింటికీ వెళ్లి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు జయరాం, అంబికా లక్ష్మీనారాయణకు ఓట్లువేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. పట్టణాధ్యక్షుడు బండారు ఆనంద్‌, ప్రధాన కార్యదర్శి గుజరీ మహమ్మద్‌ ఖాజా, ఆమ్లెట్‌ మస్తాన యాదవ్‌, గుమ్మనూరు వెంకటేశులు, అంజి, హనుమంతు, యాస్మిన, ఫ్రూట్‌ మస్తాన, ఆటో ఖాజా, కోడి సీన పాల్గొన్నారు.


నామినేషనకే వలస తెచ్చుకోవాల్సిన దుస్థితి

పామిడి: గుంతకల్లు నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి నామినేషనకే పక్క జిల్లాలోని ఆదోని, మంత్రాలయం, ఉరవకొండ నుంచి ప్రజలను వలస తెచ్చుకోవాల్సిన దుస్థితి నెలకొందని గుమ్మనూరు నారాయణ ఎద్దేవా చేశారు. పట్టణంలోని 7, 8వ వార్డులలో బుధవారం టీడీపీ, జనసేన నాయకులుతో కలిసి ఆయన ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఆదరించండి.. జయరాంను ఆదరిస్తే అభివృద్ధి చేస్తామని గుమ్మనూరు ఈశ్వర్‌ అన్నారు. బుధవారం ఉదయాన్నే ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానంలో వాకింగ్‌ చేస్తున్న వృద్ధులు, యువకులతో ఆయన చర్చించారు. బీసీసీ రోడ్డుపై ఉన్న ప్రజలతో మమేకమై ఆప్యాయంగా పలకరించారు. ఎన్డీయే కూటమిని ఆశీర్వదించాలని కోరారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Apr 24 , 2024 | 11:51 PM