విద్యారంగాన్ని బలోపేతం చేయాలి: ఎనటీయూ
ABN , Publish Date - Jul 08 , 2024 | 12:08 AM
గత వైసీపీ ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాల వల్ల విడుదల చేసిన జీవోలను రద్దు చేయాలని, ప్రస్తుత ప్రభుత్వం విద్యారంగాన్ని బలోపేతం చేసేలా చర్యలు తీసుకోవాలని ఎస్‌టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు రఘునాథ్‌రెడ్డి కోరారు.

కదిరిఅర్బన, జూలై 7: గత వైసీపీ ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాల వల్ల విడుదల చేసిన జీవోలను రద్దు చేయాలని, ప్రస్తుత ప్రభుత్వం విద్యారంగాన్ని బలోపేతం చేసేలా చర్యలు తీసుకోవాలని ఎస్‌టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు రఘునాథ్‌రెడ్డి కోరారు. ఆదివారం పట్టణంలోని జిల్లా పరిషత ఉన్నత పాఠశాలలో జిల్లా అధ్యక్షుడు హరిప్రసాద్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఎస్‌టీయూ జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఉన్నత పాఠశాలలో విలీనం చేసిన 3,4,5 తరగతులను ప్రాథమిక పాఠశాలలోనే కొనసాగించాలని, అలాగే ఉన్నత పాఠశాలలో ఆంగ్లమాద్యంతో పాటు తెలుగును సమాతర మాద్యంగా కొనసాగించాలని అన్నారు. ఉపాధ్యాయులపై బోధనేత కార్యక్రమాల పనిభారం తగ్గించాలన్నారు. ఉపాధ్యాయుల కొరతను, పని సర్దుబాటు, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ద్వారా నియమించాలన్నారు. తల్లికి వందనం పథకాన్ని ప్రభుత్వ పాఠశాలలకే వర్తింప చేయాలన్నారు. 2003 డీఎస్పీ ఉపాధ్యాయులకు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వుల మేరు పాత పింఛన అమలు చేయాలని కోరారు. రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పింఛనర్లకు చెల్లించాల్సిన బకాయిలపై నిర్ణయం ప్రకటించాలన్నారు. 1998-2008 డీఎస్సీ, ఎంటీఎస్ ఉపాధ్యాయులను రెగ్యులర్ ప్రాతిపదిక నియమించాలని కోరారు. అనతరం ఉద్యోగ విరమణ పొందిన ఉపాధ్యాయులు ఖదర్‌వలీ, సుకుమార్‌రెడ్డి, వెంకటేశ్వర్లను సన్మానిం చారు. ఈ కార్యక్రమంలో చంద్రశేఖర్, గోపాల్‌నాయక్, మురళీ, గోవిందునాయుడు, బిఎన ప్రసాద్, రవీంద్ర, జవహర్, సీపీఐ వేమయ్య తదితరులు పాల్గొన్నారు.