Share News

ప్రశాంత పుట్టపర్తిని అశాంతిగా మార్చిన దుద్దుకుంట

ABN , Publish Date - Apr 08 , 2024 | 12:06 AM

ప్రశాంతతకు మారుపేరుగా నిలిచిన పుట్టపర్తిని అశాంతిగా మార్చిన ఘనుడు ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి అని ఉమ్మడి అభ్యర్థి పల్లెసింఽధూరారెడ్డి, మాజీ మంత్రి పల్లెరఘునాథరెడ్డి ద్వజమెత్తారు.

ప్రశాంత పుట్టపర్తిని అశాంతిగా మార్చిన దుద్దుకుంట
మాట్లాడుతున్న పల్లె సింధూర, పక్కన మాజీ మంత్రి పల్లె

టీడీపీ కూటమి అభ్యర్థి పల్లె సింధూర

పుట్టపర్తి, ఏప్రిల్‌ 7: ప్రశాంతతకు మారుపేరుగా నిలిచిన పుట్టపర్తిని అశాంతిగా మార్చిన ఘనుడు ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి అని ఉమ్మడి అభ్యర్థి పల్లెసింఽధూరారెడ్డి, మాజీ మంత్రి పల్లెరఘునాథరెడ్డి ద్వజమెత్తారు. ఆదివారం సాయంత్రం జిల్లా కేంద్రంలోని ఎనుములపల్లిలో ప్రచారాన్ని నిర్వహించారు. ముందుగా కాశీవిశ్వేశ్వరాలయం వెళ్లి శివకేశవులను దర్శించుకున్నారు. వారు మాట్లాడుతూ.. పుట్టపర్తి ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చెందిందని, అయితే శ్రీధర్‌రెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికైన తరువాత దౌర్జన్యాలు, కబ్జాలు, వసూళ్లు పెరిగిపోయాయన్నారు. దీంతో ప్రశాంతంగా ఉన్న పుట్టపర్తిలో అశాంతి నెలకొందని, ఇటు ప్రజలు, అటు భక్తులు ఎంతో అవేదనకు గురయ్యారన్నారు. ఇలాంటి ఎమ్మెల్యేను మరోసారి గెలిపిస్తే పుట్టపర్తి పరిస్థితి మరింత దిగజారుతుందన్నారు. టీడీపీని గెలిపించడం ద్వారా ముఖ్యమంత్రిగా చంద్రబాబును చేసుకోవాల్సినఅవసరం ఉందన్నారు. పల్లె వెంకటక్రిష్ణకిశోర్‌రెడ్డి, సామకోటి ఆదినారాయణ, జనసేన పత్తిచంద్రశేఖర్‌ పాల్గొన్నారు.

ఓబుళదేవరచెరువు: మండలంలోని ఇనగలూరు గ్రామంలో సూపర్‌ సిక్స్‌ పథకాలపై టీడీపీ నాయకులు ఆదివారం విస్తృత ప్రచారం చేశారు. నాయకులు మాట్లాడుతూ సైకిల్‌ గుర్తు ఓటు వేసి కూటమి ఎమ్మెల్యేఅభ్యర్థి పల్లె సింధూరాను గెలిపించాలని గెలిపించాలన్నారు. షబ్బరీష్‌ నాయుడు, రామానాయుడు, చంద్రశేఖర్‌నాయుడు, చంద్రానాయుడు, శివప్రసాద్‌నాయుడు, నరసింహులు, శ్రీనివాసులు, నాగేంద్ర, బాబునాయక్‌, శ్రీరాములు, గంగాద్రి పాల్గొన్నారు. అలాగే గ్రామాల్లో పల్లె సింధూరా గెలుపునకు వడ్డెర్లు ఆదివారం విస్తృత ప్రచారం చేశారు. పల్లపు రవీంద్ర, జెరిపిటి ఆంజనప్ప, పీట్ల సుధాకర్‌ మండలంలోని వీర ఓబునపల్లి, బోగానిపల్లి, తదితర గ్రామాల్లో ప్రచారం చేశారు.

బుక్కపట్నం: మండలంలోని క్రిష్ణాపురం గ్రామంలో కూటమి అభ్యర్థి పల్లె సింధూరారెడ్డికి మద్దతుగా ఐటీడీపీ నాయకులు విస్తృత ప్రచారం చేశారు ఆదివారం ఇంటింటికి తిరుగుతూ సూపర్‌ సిక్స్‌ పథకాలను,టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే చేపట్టే సంక్షేమపథకాలలను వివరింస్తూ ఓటర్లనుఅభ్యర్థించారు. అప్పస్వామి, రాము, రెడ్డెప్ప, రమణ, రమేష్‌, మల్లికార్జునచౌదరి, నాగభూషణ పాల్గొన్నారు.

నల్లమాడ: మండలంలోని మసకవంకపల్లి, ఎన బండవాండ్లపల్లి గ్రామాల్లో టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో ఆదివారం సూపర్‌ సిక్స్‌పై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో మండల కన్వీనర్‌ మైలే శివశంకర్‌, మాజీ కన్వీనర్‌ కేశవరెడ్డి, బుట్టి నాగభూషణనాయుడు పాల్గొన్నారు.

Updated Date - Apr 08 , 2024 | 12:06 AM