Share News

మద్యం మత్తులో డ్రైవింగ్‌

ABN , Publish Date - Mar 14 , 2024 | 11:51 PM

మద్యం మత్తులో యువత వాహనాలు నడుపుతూ రోడ్లపై నానా వీరంగం సృష్టిస్తున్నారు. పోలీసులకు అడ్డంగా దొరి కి పలువురు కేసుల పాలవుతున్నారు.

మద్యం మత్తులో డ్రైవింగ్‌
కొడికొండ చెక్‌పోస్టులో తనిఖీలు చేస్తున్న పోలీసులు

ప్రమాదాలకు కారణమవుతున్న వైనం

యువకులే అధికం

అరికట్టలేకపోతున్న పోలీసు తనిఖీలు, అవగాహన కార్యక్రమాలు

చిలమత్తూరు, మార్చి 14 : మద్యం మత్తులో యువత వాహనాలు నడుపుతూ రోడ్లపై నానా వీరంగం సృష్టిస్తున్నారు. పోలీసులకు అడ్డంగా దొరి కి పలువురు కేసుల పాలవుతున్నారు. కానీ మం డలంలోని యువతలో మార్పు రావడంలేదు. మండలంలో గత సంవత్సరం 74 వరకు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులు నమోదయ్యాయి. ఇందులో అత్యధికంగా యువకులే ఉండటం విశేషం. ప్రధానంగా మండలానికి సరిహద్దుగా ఉన్న కర్ణాట కలోని బాగేపల్లిలో మద్యం తాగి వస్తూ కొడికొండ చెక్‌పోస్టులో పోలీసులకు పట్టుబ డుతున్నారు. స్నేహితులతో కలిసి పార్టీలు చేసుకుని, మద్యం తాగి ద్విచక్రవాహనాలను నడుపుతూ ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రమాదాలకు కారణమవుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. మద్యం తాగడంతో పాటు వాహనాలను పరిమితికి మించి వేగంగా నడపడం, ఎదురుగా వస్తున్న వారిని, రోడ్డు దాటుతున్న వారిని గమనించకుండా దూసుకుపోవడం వంటి వాటితో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నట్లు విమర్శలున్నాయి.

మద్యం ప్రియులకు కేరాఫ్‌ టీబీ క్రాస్‌ హైవే

మద్యానికి అలవాటు పడిన వారు కర్ణాటకలోని బాగేపల్లి వద్ద టీబీ క్రాస్‌ హైవే డాబాలకు వెళుతున్నారు. అక్కడ పీకల దాకా మద్యం తాగి, ఆ మత్తులోనే వాహనాలు నడుతూ ఇళ్లకు అతికష్టం మీద చేరుకుంటున్నారు. ఈ క్రమంలోనే ప్రమాదాలకు కారణమవుతున్నారు. కర్ణాటకలో మద్యం ధరలు కొంతవరకు ఏపీలో కంటే తక్కువ. అంతేగాకుండా టీబీ క్రాస్‌ హైవేలో ఉన్న మద్యం దుకాణాల్లో కోరిన మద్యం బ్రాండ్లు దొరుకుతున్నాయి. దీంతోపాటు మద్యంతాగడానికి అనుగుణంగా అక్కడ డాబాలు ఉంటున్నాయి. అర్ధరాత్రి వరకు తాగినా అక్కడి పోలీసులు చర్యలు తీసుకోరు. దీంతో మద్యం ప్రియులకు టీబీ క్రాస్‌ హైవే కేరాఫ్‌గా మారింది.

తనిఖీలు చేస్తున్నా తగ్గని మందుబాబుల జోరు

కర్ణాటక నుంచి మద్యం తాగి వాహనాలు నడుపుతున్న వారిని కట్టడి చేసేందుకు స్థానిక పోలీసులు ఇటీవల రోజూ సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కొడికొండ చెక్‌ పోస్టులో డ్రంక్‌ అండ్‌ డైరవ్‌ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఊగుతూ వాహనాలను నడుపుతున్న వారిని గుర్తించి కేసులు నమోదు చేస్తున్నారు. అయినా మ ద్యం బాబుల తీరు షరా మామూలైపోయింది. తాగి వాహనాలు నడిపితే ప్రమాదాలకు గురవుతారని పోలీసులు ఎంత అవగాహన కల్పించినా వృథానే అవుతోంది. కేవలం చిన్న చిన్న జరిమానాలతో సరిపుచ్చుతుంటుండటంతో మద్యం ప్రియుల్లో భయం లేకుండా పోతోందని ప్రజలు చర్చించుకుంటున్నారు.

మద్యంతాగి వాహనాలు నడపకండి- గంగాధర్‌, ఎస్‌ఐ, చిలమత్తూరు

మద్యంతాగి వాహనాలు నడపడం ద్వారా అమాయకు లు కూడా ప్రాణాలు కోల్పోతారు. వాహన చట్టం ప్రకారం మద్యంతాగి వాహనాలు నడపడం నేరం. అటువంటి వా రిపై కేసులు నమోదు చేసి జైలులు పంపుతున్నాం. కు టుంబ సభ్యుల గురించి ఆలోచించేవారు ఎవరూ మద్యం తాగి వాహనాలు నడపరు. వారు చేసే తప్పు కారణంగా ప్రమాదాలు జరిగి జీవితాంతం అంగవైకల్యం పొందడం, లే దా ప్రాణాలు కోల్పోయి కుటుంబ సభ్యులు అనాథలయ్యేందుకు అవకాశం ఉంది.

Updated Date - Mar 14 , 2024 | 11:51 PM