Share News

మడకశిరలో తాగునీటి ఎద్దడి

ABN , Publish Date - Mar 22 , 2024 | 11:48 PM

నగర పంచాయతీ పరిధిలోని పలు వార్డులలో నీటి సమస్య జఠిలంగా మారింది. నెల రోజులకు పైగా నెలకొన్న సమస్యను పరి ష్కరించేందుకు నగర పంచాయతీ అధికారులు ఏమాత్రం చర్యలు చేపట్టడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

మడకశిరలో తాగునీటి ఎద్దడి
మడకశిరలోని మారుతీ నగర్‌లో మరమ్మతులకు లోనైన బోరు

నెలరోజులుగా ఇబ్బందులు పడుతున్న పలు వార్డుల ప్రజలు

పట్టించుకోని నగర పంచాయతీ అధికారులు

మడకశిరటౌన, మార్చి 22: నగర పంచాయతీ పరిధిలోని పలు వార్డులలో నీటి సమస్య జఠిలంగా మారింది. నెల రోజులకు పైగా నెలకొన్న సమస్యను పరి ష్కరించేందుకు నగర పంచాయతీ అధికారులు ఏమాత్రం చర్యలు చేపట్టడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. చిన్న చిన్న మరమ్మతులకే వారు దాదాపు 15 నుంచి నెల రోజుల సమయం తీసుకుంటు ఉండటంతో నీటి సమస్య జఠిలంగా మారిందని పట్టణ వాసులు విమర్శిస్తున్నారు. దీంతోపాటు భూగర్భ జలాలు అడుగంటుతుండటంతో బోర్లలో నీటిమట్టం తగ్గిపోయిందని, దీంతో నగరపంచాయతీ పరిధిలో నీటి సరఫరా సక్రమంగా జరగడం లేదని అంటు న్నారు. పంచాయతీ బోర్లలోకి అదనంగా పైపులు దింపడం వల్ల సమస్య పరి ష్కారమవుతుందని అంటున్నారు. అయినా అధికారులు ఆదిశగా చర్యలు చేపట్ట డం లేదని వాపోతున్నారు. మారుతీ నగర్‌లో ఆంజనేయస్వామి దేవాలయం సమీ పంలో ఉన్న బోరు, స్టార్టర్‌ చెడిపోయి 15 రోజులు గడుస్తున్నా మరమ్మతులు సైతం చేయలేని పరిస్థితుల్లో మున్సిపాలిటీ అధికారులు ఉన్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా మోటారు మరమ్మతులకు రావడంతో దాదాపు 20 రోజుల నుంచి నీటి సరఫరా ఆగిపోయిందని, దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాగే 12వవార్డు, చౌటిపల్లి, శివాపురంలోని పలు కాలనీల్లో నీటి సరఫరా సక్రమంగా జరగడం లేదని ఆయా కాలనీల వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి మోటారు, స్టార్టర్‌ వం టి వాటికి మరమ్మతులు చేయించాలని అంటున్నారు. తద్వారా నగర పంచాయతీ పరిధిలో నీరు సరఫరా సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

కొత్తచామలపల్లిలో...

చిలమత్తూరు: మండలంలోని కొత్తచామలపల్లిలో తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉందని ఆ గ్రామస్థులు పేర్కొన్నారు. గ్రామంలో రెండు బోరుబావుల ద్వారా తాగునీరు అందేదని, అయితే వాటిలో భూగర్భజలాలు అడుగంటడంతో సమస్య వచ్చిందన్నారు. తాము నెల రోజులుగా నీటి కోసం ఇబ్బందులు పడుతున్నా పట్టించుకున్న వారే లేరన్నారు. సమస్యపై గ్రామ సర్పంచకు, అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేదన్నారు. వ్యవసాయ బోరుబావుల వద్దకు వెళ్లి నీటిని తెచ్చుకుంటూ అవసరాలకు వాడుకుంటున్నామని వాపో యారు. అయితే ప్రస్తుతం వేసవి కావడంతో కొందరు రైతులు పంటల సాగుకు నీళ్లు తగ్గుతాయని తమను రానివ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నెల రోజులుగా తీవ్ర ఇబ్బం దులు పడుతున్నా గ్రామానికి వచ్చి సమస్య తెలుసుకోవడంలో పాలకవర్గం, అధికార గణం పూర్తిగా విఫలమయ్యారన్నారు. ఇప్పటికైనా కొత్త బోరుబావి తవ్వించిగానీ లేదా తాత్కాలిక చర్యలు చేపట్టిగా సమస్య పరిష్కారం అయ్యేలా చూడాలని గ్రామస్థులు కోరుకుంటున్నారు. సమస్య పరిష్కరించకపోతే గ్రామస్థులందరం కలిసి పెద్ద ఎత్తున ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఆందోళన చేపడతామన్నారు.

Updated Date - Mar 22 , 2024 | 11:48 PM