Share News

డబుల్‌ మహర్దశ

ABN , Publish Date - Feb 12 , 2024 | 12:04 AM

అనంతపురం రైల్వేస్టేషన రూపురేఖలు మరో ఏడాదిలో పూర్తిగా మారనున్నాయి. ఇప్పటికే డబుల్‌ లైన ఏర్పాటులో భాగంగా కేవలం రెండు ప్లాట్‌ఫారాలకే పరిమితం అయిన స్టేషనలో నాలుగు ప్లాట్‌ఫారాలు ఏర్పాటు చేస్తున్నారు.

డబుల్‌ మహర్దశ

అనంతపురం న్యూటౌన, ఫిబ్రవరి 11: అనంతపురం రైల్వేస్టేషన రూపురేఖలు మరో ఏడాదిలో పూర్తిగా మారనున్నాయి. ఇప్పటికే డబుల్‌ లైన ఏర్పాటులో భాగంగా కేవలం రెండు ప్లాట్‌ఫారాలకే పరిమితం అయిన స్టేషనలో నాలుగు ప్లాట్‌ఫారాలు ఏర్పాటు చేస్తున్నారు. డబుల్‌ లైన పనులు దాదాపు పూర్తి అయ్యాయి. స్టేషన ఆవరణంలో నిర్మాణం ఇంకా జరుగుతూనే ఉన్నాయి.

ప్రస్థానం : 1892లో గుంతకల్లు నుంచి బెంగళూరు మధ్య రైళ్ల రాకపోకలకు అనంతపురం మీదుగా మీటర్‌ గేజ్‌ను ఏర్పాటు చేశారు. అనంతరం 1977 అక్టోబరు 2 సౌత సెంట్రల్‌ రైల్వేగా మారింది. తిరిగి మీటర్‌ గేజ్‌తో పాటు 1982లో బ్రాడ్‌ గేజ్‌ లైన కూడా ఏర్పాటు చేశారు. సికింద్రాబాద్‌, గుంతకల్లు, వాడి డివిజన్లుగా ఏర్పాటు చేశారు. 2006లో జిల్లా కేంద్రం మీదుగా గుంతకల్లు, ధర్మవరం, పాకాల మార్గాన్ని బ్రాడ్‌ గేజ్‌గా మార్పు చేశారు. 2016లో విద్యుత లైన ఏర్పాటు చేశారు. ప్రస్తుతం డబుల్‌ లైన పనులు జరుగుతున్నాయి. దీంతో పాటు స్టేషన రూపురేఖలనూ మార్చనున్నారు. మొదటి దశ పనులు దాదాపు ఆఖరి దశకు చేరుకున్నాయి. పాత స్టేషన భవనం స్థానంలో కొత్త భవనాన్ని నిర్మిస్తున్నారు.

Updated Date - Feb 12 , 2024 | 12:04 AM