Share News

దళితులపై వైసీపీ దౌర్జన్యాలను పట్టించుకోరా..!

ABN , Publish Date - Feb 27 , 2024 | 11:50 PM

దళితుల ఇంటి స్థలాలను వైసీపీ నాయకులు దౌర్జన్యంగా ఆక్రమిస్తున్నా అధికారులు ఎందుకు పట్టించుకోవడంలేదని ఎమ్మార్పీ ఎస్‌ నాయ కులు మండిపడ్డారు.

దళితులపై వైసీపీ దౌర్జన్యాలను పట్టించుకోరా..!
సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మార్పీఎస్‌ నాయకులు

చెన్నేకొత్తపల్లి, ఫిబ్రవరి 27: దళితుల ఇంటి స్థలాలను వైసీపీ నాయకులు దౌర్జన్యంగా ఆక్రమిస్తున్నా అధికారులు ఎందుకు పట్టించుకోవడంలేదని ఎమ్మార్పీ ఎస్‌ నాయ కులు మండిపడ్డారు. స్థానిక డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ విగ్రహం వద్ద మంగళవారం ఎమ్మార్పీఎస్‌ నాయకులు బేకరీ గంగాధర్‌, రామాంజినేయులు, సూర్యనారాయణ, మల్లెల తిప్పన్న, దబ్బల శ్రీరాములు మాట్లాడారు. కురుగుంటలో దళితులకు ఇచ్చిన స్థలాలను ఎమ్మెల్యే తోపుదుర్తి సోదరుల అండతో కొందరు వైసీపీ నాయకులు కబ్జా చేయడా నికి యత్నిస్తున్నా రన్నారు. దీనిపై పలుమార్లు కలెక్టర్‌తో సహా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎవరూ పట్టించుకోవడం లేదన్నా రు. దీన్ని నిరసిస్తూ ఎమ్మార్పీఎస్‌ నేత బీసీ ఆర్‌దాస్‌ సోమవారం అనంతపురం కలెక్టరేట్‌ లోని స్పందనలో అధికారుల ముందే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నిం చాడ న్నారు. దీనికి అధికారుల నిర్లక్ష్యమే కారణమన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించాలన్నారు.

Updated Date - Feb 27 , 2024 | 11:50 PM