Share News

జిల్లా కేంద్రాన్ని అభివృద్ధి చేస్తా: పల్లె

ABN , Publish Date - Jan 14 , 2024 | 12:20 AM

పుట్టపర్తి, జనవరి 13: సత్యసాయి బాబా సేవలకు గుర్తింపుగా ఏర్పడిన శ్రీసత్యసాయి జిల్లా కేంద్రాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేస్తామని, రానున్న ఎన్నికల్లో టీడీపీ గెలుపు ఖాయమని మాజీ మంత్రి పల్లె రఘునాథ రెడ్డిపేర్కొన్నారు.

  జిల్లా కేంద్రాన్ని అభివృద్ధి చేస్తా: పల్లె

పుట్టపర్తి, జనవరి 13: సత్యసాయి బాబా సేవలకు గుర్తింపుగా ఏర్పడిన శ్రీసత్యసాయి జిల్లా కేంద్రాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేస్తామని, రానున్న ఎన్నికల్లో టీడీపీ గెలుపు ఖాయమని మాజీ మంత్రి పల్లె రఘునాథ రెడ్డిపేర్కొన్నారు. పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో శనివారం తెలుగుయువత ప్రొఫెషనల్‌ వింగ్‌, ఐటీ జనరల్‌ సెక్రెటరీ తలిపినేని పాండు ఆధ్వర్యంలో కనెక్ట్‌ విత లీడర్‌ పేరుతో చర్చావేదిక నిర్వహించారు. ఇందులో పాల్గొన్న ఐటీ ఉద్యోగులు, డాక్టర్లు, టీచర్లు, లాయర్లు అడిగిన పలు ప్రశ్నలకు పల్లె క్షుణంగా సమాధానం ఇచ్చారు.

మహిళల రక్షణకు మీరు ఎలాంటి చట్టం తెస్తారని ఐటీ ఉద్యోగి శ్రీదేవి ప్రశ్నించగా.. టీడీపీ అధికారంలోకి రాగానే సమాజంలో మహిళల రక్షణకోసం ప్రత్యేక చట్టం తీసుకురావాడానికి చేయాల్సిన ప్రయత్నమంతా చేస్తానని తెలిపారు. నిరుద్యోగ యువతకు ఎలాంటి ఉపాధి చూపుతారని బాలుకిరణ్‌రెడ్డి ప్రశ్నించగా.. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత కొత్తగా పరిశ్రమలు తీసుకొచ్చి నిరుద్యోగయువతకు ఉపాఽధి కల్పిస్తామన్నారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో కియ ద్వారా చంద్రబాబు 13వేల ఉద్యోగాలు కల్పించారని తెలిపారు. కొత్తచెరువులో 30పడకల ఆస్పత్రి, బీసీ హాస్టల్‌ పూర్తికాలేదు, వాటిని మీరేమి చేస్తారని మధుసూదన ప్రశ్నించగా.. పెండింగ్‌లో ఉన ్న 30పడకల ఆస్పత్రి, హాస్టల్‌ నిర్మాణం, స్టేడియం, టి డ్కో ఇళ్లు పూర్తి చేసి లబ్ధిదారులకు ఇస్తామని చెప్పారు. 2023 ల్యాండ్‌ టైటింగ్‌ చట్టాన్ని రద్దు చేస్తారా? అని న్యాయవాది శ్రీనివాసులు ప్రశ్నించగా.. ఆ చట్టాన్ని రద్దు చేయడంతోపాటు రైతులకు భూమిపైన న్యాయమైన హక్కులు కల్పిస్తామని పల్లె సమాధానమిచ్చారు. ఆరోగ్యశ్రీ అమలుపై ఎలాంటి చర్యలు తీసుకుంటారని వైద్యుడు రాంప్రసాద్‌ అడగ్గా.. ఆ పథకంలో రోగాల పరిమితి పెంచుతూ.. మంచి వైద్య అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఇవికాకుండా సీఎం రిలీఫ్‌ ఫండ్‌ ద్వారా రోగులను ఆదుకుంటామని తెలిపారు. ప్రెస్‌క్లబ్‌, ఇంటిస్థలాల సమస్య పరిష్కరిస్తారా? అని విలేకరి మహేష్‌ ప్రశ్నించగా.. జర్నలిస్టులకు జిల్లా కేంర దంలో ప్రెస్‌క్లబ్‌ నిర్మించడంతో పాటు, ఇంటిపట్టాలు అందచేస్తామని చెప్పారు. జిల్లా కేంద్రాన్ని మారుస్తారా? అని జనసేన నాయకుడు అబ్ధుల్‌ ప్రశ్నించగా జిల్లా కేంద్రం మార్పు ఉండదని, ఒకేచోట కలెక్టర్‌ కార్యాలయంలోపాటు అన్నికేంద్రాలు ఏర్పాటు చేస్తామని, ఆధ్యాత్మిక కేంద్రాన్ని మరింత అభివృద్ది చేస్తామని పల్లె సమాధానమిచ్చారు.

Updated Date - Jan 14 , 2024 | 12:20 AM