Share News

చేనేతను కాపాడుకోకపోతే ధర్మవరానికి మనుగడే లేదు

ABN , Publish Date - Jan 08 , 2024 | 12:21 AM

గుండెలాంటి చేనేత పరిశ్రమను కాపాడుకోకపోతే ధర్మవరానికి మనుగడే ఉండదని టీడీపీ నియోజకవర్గ ఇనచార్జ్‌ పరిటాలశ్రీరామ్‌ అన్నారు.

చేనేతను కాపాడుకోకపోతే ధర్మవరానికి మనుగడే లేదు

ఫ మా ప్రభుత్వం వచ్చాక పాలిష్‌ కార్మికులను ఆదుకుంటాం ఫ పాదయాత్రలో టీడీపీ నియోజకవర్గ ఇనచార్జి పరిటాల శ్రీరామ్‌

ధర్మవరం, జనవరి 7: గుండెలాంటి చేనేత పరిశ్రమను కాపాడుకోకపోతే ధర్మవరానికి మనుగడే ఉండదని టీడీపీ నియోజకవర్గ ఇనచార్జ్‌ పరిటాలశ్రీరామ్‌ అన్నారు. ధర్మవరం పట్టుచీరలంటే ప్రపంచంలోనే ఒక ప్రత్యేక గుర్తింపు ఉందని, కానీ అది రోజురోజుకూ కనుమరుగవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు పాదయాత్ర నాల్గవ రోజు ఆదివారం పట్టణంలో పలు కాలనీల్లో ఆయన టీడీపీ నాయకులతో కలిసి పర్యటించారు. కన్యకాపరమేశ్వరిదేవి ఆల యం నుంచి దిగువగేరి, బడేసాహేబ్‌వీధి, బోయవీధి,మార్కెట్‌వీధి, దర్గావీది, లోనికోట, యాదవవీధి, వరలక్ష్మీథియోటర్‌ వరకు పాదయాత్ర సాగింది. అన్ని కాలనీల్లో ప్రజలు పరిటాల శ్రీరామ్‌కు పూలవర్షం కురిపిస్తూ ఘన స్వాగతం పలికారు. ఓ వైపు ‘బాబుష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ’ కార్యక్రమాన్ని నిర్వహిస్తూనే మరో వైపు ప్రజల సమస్యలను అడిగితెలుసుకున్నారు. మార్గమద్యలో చేనేత కార్మికులతో పరిటాలశ్రీరామ్‌ సమావేశమయ్యారు. ముడిసరుకుల ధరలు పెరిగిపోవడం వల్ల నేసినప్పటికీ గిట్టుబాటు ధరలేకుండా పోయిందని, కరోనా సమయం నుంచి కోలుకోలే కుండా నష్టపోతున్నామని, కార్మికులు ఆవేదన వ్యక్తంచేశారు. మరోవైపు పవర్‌లూమ్స్‌ రావడం వల్ల హ్యాండ్‌లూమ్‌ వ్యవస్థ తీవ్ర సంక్షోభంలోకి కూరుకుపోయిందన్నారు. చేనేత పరిశ్రమను కాపాడాలంటే నేత కార్మికులకు తగిన ప్రోత్సాహకాలు అందించాలని విజ్ఞప్తిచేశారు. స్పం దించిన పరిటాలశ్రీరామ్‌ గత టీడీపీ హయాంలో చేనేతలకు అన్ని రకాల సబ్సిడీలు ఉండేవని, కానీ ఇప్పుడు ఎక్కడా అలాంటి పరిస్థితి కనిపించడం లేదన్నారు. వైసీపీ ప్రభుత్వం చేనేత కార్మికులను మరింత కష్టాల్లోకి నెట్టిందని విమర్శించారు. మరోవైపు పాలిష్‌ కార్మికులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గతంలో లాభదాయకం గా ఉన్న ఈ వృత్తి ఇప్పుడు భారంగా మారుతోందన్నారు. చీరలకు వేసే గమ్‌ ధరలు విపరీతంగా పెరిగిపోవడమే కాకుండా జీఎస్టీ కూడా వేయడం పాలి్‌ష వృత్తిపై ఆధారపడిన వారు ఆదాయం కోల్పోయే పరిస్థితి ఏర్పడిం దన్నారు. ఆరోగ్యశ్రీ కూడా కార్మికులకు వర్తించలేదని, తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆరోగ్యశ్రీ వర్తింపచేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. జీఎస్టీ అంశంపై కూడా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడతామని హామీ ఇచ్చారు. టీడీపీ హయాంలో ఉన్న సబ్సిడీలు ఎందుకు ఎత్తివేశారో వైసీపీ ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు.

Updated Date - Jan 08 , 2024 | 12:21 AM