Share News

ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ సహకారంతో అభివృద్ధి పనులు

ABN , Publish Date - Aug 21 , 2024 | 12:16 AM

వెనుకబడిన నంబులపూలకుంట మండలంలో ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ సహకారంతో ఎఫ్‌ఈఎస్‌ ఆధ్వర్యంలో రూ.3.99 కోట్లతో అభివృద్ధి పనులు చేపడతామని ఆ బ్యాంక్‌ ప్రతినిధి అక్లాక్‌ పేర్కొన్నారు.

ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ సహకారంతో అభివృద్ధి పనులు
సమావేశంలో మాట్లాడుతున్న ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ ప్రతినిధి అక్లాక్‌

నంబులపూలకుంట, ఆగస్టు 20 : వెనుకబడిన నంబులపూలకుంట మండలంలో ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ సహకారంతో ఎఫ్‌ఈఎస్‌ ఆధ్వర్యంలో రూ.3.99 కోట్లతో అభివృద్ధి పనులు చేపడతామని ఆ బ్యాంక్‌ ప్రతినిధి అక్లాక్‌ పేర్కొన్నారు. మంగళవారం మండలంలోని తిమ్మమ్మ మర్రిమానులో స్కేల్‌ ప్రాజెక్టును ప్రారంభించిన ఆయన మాట్లాడారు. మూడు సంవత్సరాల పాటు మండలంలోని 14 పంచాయతీల్లో పల్లె సంఘాల ఆధ్వర్యంలో అభివృద్ధి పనులు చేపడతామన్నారు. ఈ గ్రామాల్లో పశువుల తాగునీటి గుంతలు, చెరువుల మరమ్మతులు చేపడతామన్నారు. బలిజపల్లి పంచాయతీ పరిధిలోని కెవి. బురుజు, అరవవాండ్లపల్లి గ్రామాల్లో పశువుల తాగునీటి కోసం గుంతలు తవ్వే పనులకు భూమి పూజ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ నరేంద్రకుమార్‌, గాండ్లపెంట, తలుపుల, ఎన్పీకుంట మండలాలకు చెందిన సర్పంచలు, ఎంపీటీసీలు, ఎఫ్‌ఈఎస్‌ సిబ్బంది, ప్రాజెక్టు మేనేజర్లు అరుణ, లింగమూర్తి, గిరిజ గణేష్‌, ఇంజనీర్లు మోహన సంఽధ్య, పల్లె సంఘం లీడర్లు, ప్రజలు పాల్గొన్నారు.

Updated Date - Aug 21 , 2024 | 12:16 AM