టీడీపీతోనే శింగనమల అభివృద్ధి
ABN , Publish Date - May 01 , 2024 | 12:15 AM
టీడీపీతోనే శింగనమల నియోజకవర్గం అభివృద్ధి సాధ్యమని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ద్విసభ్య కమిటీ సభ్యుడు ఆలం నరసానాయుడు అన్నారు.
నార్పల, ఏప్రిల్ 30: టీడీపీతోనే శింగనమల నియోజకవర్గం అభివృద్ధి సాధ్యమని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ద్విసభ్య కమిటీ సభ్యుడు ఆలం నరసానాయుడు అన్నారు. నార్పల మండలంలోని తుంపెర గ్రామంలో కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బండారు శ్రావణి, ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణను గెలిపించాలని మంగళవారం స్థానిక నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఇందులో టీడీపీ జిల్లా టీడీపీ నాయకులు ఆలం వెంకట నరసా నాయుడు, పిట్టురంగారెడ్డి, ఎర్రినాగప్ప, ఆలం నాగార్జుననాయుడు, బయపరెడ్డిచంద్రబాబు పాల్గొన్నారు.
నేడు పలు గ్రామాల్లో ప్రచారం
శింగనమల: బండారు శ్రావణిశ్రీ బుధవారం శింగనమల మండలంలోని జూల్వాకాలువ, పెద్దజలాలపురం, చిలేపల్లి ఇరువెందల, కల్లుమడి తరిమెల గ్రామాల్లో ప్రచారం నిర్వహి స్తారని, పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు తరలిరావాలని రాష్ట్ర తెలుగు యువత అధికార ప్రతినిధి దండు శ్రీనివాసులు పిలుపునిచ్చారు.
వైసీపీ నుంచి టీడీపీలోకి
గార్లదిన్నె: మండలంలోని సంజీవపురం, బూదేడు గ్రామాల్లో ముంటిమడుగు కేశవరెడ్డి, సీనియర్ నాయకురాలు బండారు లీలావతి, బండారు కిన్నెర శ్రీ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. పాతకల్లూరులో 50 కుటుంబాలు టీడీపీలో చేరాయి.
మరిన్ని వార్తల కోసం...