టీడీపీతోనే అభివృద్ధి సాధ్యం: నాయకులు
ABN , Publish Date - Apr 03 , 2024 | 12:13 AM
యోజకవర్గం అన్నివిధాలా అభివృద్ధి చెందా లంటే తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని టీడీపీ నాయకులు పేర్కొన్నారు

హిందూపురం, ఏప్రిల్ 2: నియోజకవర్గం అన్నివిధాలా అభివృద్ధి చెందా లంటే తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని టీడీపీ నాయకులు పేర్కొన్నారు. హిందూపురం మండలంలోని కగ్గల్లు గ్రామంలో మంగళవారం నాయకులు, కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోను వివరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ కోఆర్డినేటర్ శ్రీనివాసరావు, కన్వీనర్ అశ్వత్థ నారాయణరెడ్డి, బీసీసెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బేవనహళ్లి ఆనంద్, నాయకులు రాము, హనుమంతు, ఆదినారాయణ, నారాయణరెడ్డి, మంజునాథ్, రామ క్రిష్ణారెడ్డి, శ్రీరామప్ప, నాగన్న, ఉమాశంకర్‌రెడ్డి, అంజనేయులు, గోపాల్‌రెడ్డి, జయరాం, నంజుండప్ప తదితరులు ఉన్నారు.
చిలమత్తూరు: అన్ని వర్గాలకు న్యాయం జరగాలంటే త్వరలో జరిగే ఎన్నికల్లో టీడీపీని ఆదరించాలని ఆ పార్టీ నాయకులు కోరారు. మండలంలోని కోడూరు తోపు, తుమ్మలకుంట గ్రామాల్లో మంగళవారం హిందూపురం ఎమ్మెల్యే అభ్యర్థి బాలకృష్ణ, ఎంపీ అభ్యర్థి పార్థసారధికి మద్ద తుగా ఇంటింటి ప్రచారం చేశారు. కార్యక్రమంలో ఎస్సీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి బేకరీ గంగాధర్, శ్రీదేవి, మాజీ ఎంపీటీసీ సూర్యనారాయణ, మీసేవ సూరి, గంగాధర్ , కిష్టప్ప, శ్రీరామప్ప, వెంకటసుబ్బయ్య, చంద్ర, వెంకటేష్, నారాయణప్ప, అంజి, నరేష్, బాబు, హరీష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. సూపర్ సిక్స్ పథకాలపై అవగాహన కల్పించారు.