Share News

మరింత అభివృద్ధి చేయండి

ABN , Publish Date - Jan 12 , 2024 | 12:27 AM

జేఎనటీయూకి నేషనల్‌ అసెస్మెంట్‌ అండ్‌ అక్రిడిటేషన కౌన్సిల్‌ (న్యాక్‌) సంస్థచే గుర్తింపు పొందే అన్ని అర్హతలూ ఉన్నాయని, మరింత అభివృద్ధి సాధిస్తే గుర్తింపు సాధించడం సలభతరం అవుతుందని న్యాక్‌ మాక్‌ పీర్‌ కమిటీ అభిప్రాయపడింది

మరింత అభివృద్ధి చేయండి
సూచనలు ఇస్తున్న కమిటీ సభ్యులు

అనంతపురం సెంట్రల్‌, జనవరి 11: జేఎనటీయూకి నేషనల్‌ అసెస్మెంట్‌ అండ్‌ అక్రిడిటేషన కౌన్సిల్‌ (న్యాక్‌) సంస్థచే గుర్తింపు పొందే అన్ని అర్హతలూ ఉన్నాయని, మరింత అభివృద్ధి సాధిస్తే గుర్తింపు సాధించడం సలభతరం అవుతుందని న్యాక్‌ మాక్‌ పీర్‌ కమిటీ అభిప్రాయపడింది. న్యాక్‌ గుర్తింపు కోసం జేఎనటీయూ యాజమాన్యం దరఖాస్తు చేసుకున్న నేపథ్యంలో మాక్‌ పీర్‌ కమిటీ రెండు రోజుల పాటు వర్సిటీలో పర్యటించింది. పలు విభాగాలను పరిశీలించింది. అనంతరం వీసీ రంగజనార్ధన, వివిధ విభాగాల అధిపతులతో గురువారం సమావేశం నిర్వహించింది. వర్సిటిని మరింత అభివృద్ధి చేయడానికి అవసరమైన సలహాలు, సూచనలు చేసింది. కార్యక్రమంలో రెక్టార్‌ విజయకుమార్‌, ఐక్యూఏసీ డైరెక్టర్‌ సుబ్బారెడ్డి, వివిధ డైరెక్టర్లు, ప్రిన్సిపాల్‌ సత్యనారాయణ, వైస్‌ ప్రిన్సిపాల్‌ అరుణకాంతి పాల్గొన్నారు.

Updated Date - Jan 12 , 2024 | 12:27 AM