Devara bullocks ఘనంగా దేవర ఎద్దుల వేల్పు
ABN , Publish Date - Jun 17 , 2024 | 12:39 AM
మండలంలోని రాచినేపల్లి గ్రామంలో ఆదివారం దేవర ఎద్దుల వేల్పు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. 20 ఏళ్లకు ఒకసారి ఈ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో సాంప్రదాయబద్ధంగా నిర్వహించడం ఆనవాయితీ. ఈ క్రమంలో రాచినేపల్లి గ్రామస్థులంతా దేవర ఎద్దుల వేల్పును పెద్దఎత్తున నిర్వహించారు.

- పాల్గొన్న ఎమ్మెల్యే కందికుంట
తనకల్లు, జూన 16: మండలంలోని రాచినేపల్లి గ్రామంలో ఆదివారం దేవర ఎద్దుల వేల్పు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. 20 ఏళ్లకు ఒకసారి ఈ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో సాంప్రదాయబద్ధంగా నిర్వహించడం ఆనవాయితీ. ఈ క్రమంలో రాచినేపల్లి గ్రామస్థులంతా దేవర ఎద్దుల వేల్పును పెద్దఎత్తున నిర్వహించారు.
కార్యక్రమానికి తనకల్లు మండలం చిన్నపల్లి, నంబులపూలకుంట మండలం మేకలచెరువు, గాండ్లపెంట మండలం కోటూరు, నల్లచెరువు మండలం బాలినేని ఎగువ, దిగువతండాలు, పూలకుంటపల్లి, కదిరి మున్సిపాలిటీ పరిధిలోని కుటాగుళ్ల గ్రామాలకు చెందిన దేవరెద్దులు కార్యక్రమంలో పాల్గొన్నాయి. శ్రీనివాచారులు వేదమంత్రాలతో పూజలు చేశారు. కదిరి, పుట్టపర్తి నియోజకవర్గాలతో పాటు అన్నమయ్య జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి సైతం భక్తులు అఽధికసంఖ్యలో తరలివచ్చారు. పూజల అనంతరం రాచినేపల్లి గ్రామస్థులు దేవర ఎద్దుల యజమానులకు బ హుమతులు ప్రదానం చేశారు. భక్తులకు అన్నదానం నిర్వహించారు.
పాల్గొన్న ఎమ్మెల్యే కందికుంట :
దేవర ఎద్దుల వేల్పు కార్యక్రమంలో ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పాల్గొన్నారు. దేవర ఎద్దులకు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామాల్లో నేటికి సంప్రదాయంగా దేవర ఎద్దుల వేల్పు నిర్వహించ డం ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమాన్ని నిర్వహించిన గ్రామస్థులను అభినందించారు. ఆయన వెంట పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం...