రాజకీయ లబ్ధి కోసమే పింఛన్ల పంపిణీలో జాప్యం
ABN , Publish Date - Apr 03 , 2024 | 12:06 AM
పింఛన్ల పంపిణీని అడ్డం పెట్టుకుని రాజకీయ లబ్ధి పొందేందుకు వైసీపీ ప్రభుత్వం కుట్రపన్నుతోందని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సునీల్‌కుమార్ విమర్శించారు.

టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సునీల్‌కుమార్
మడకశిరటౌన, ఏప్రిల్ 2: పింఛన్ల పంపిణీని అడ్డం పెట్టుకుని రాజకీయ లబ్ధి పొందేందుకు వైసీపీ ప్రభుత్వం కుట్రపన్నుతోందని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సునీల్‌కుమార్ విమర్శించారు. సచివాలయాలు, పంచాయతీ సిబ్బందితో పంపిణీ చేసే అవకాశం ఉన్నా జాప్యం చేస్తోందన్నారు. సకాలంలో పింఛన్లు పంపిణీ చేయాలంటూ మంగళవారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయం ఆవరణం లో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సునీల్‌కుమార్ మాట్లాడుతూ... ముఖ్య మంత్రి జగన వైసీపీ నేతల కాంట్రాక్ట్ బిల్లులకు కాంట్రాక్టుకు సంబంధించి రూ. 13వేల కోట్లు సర్దుబాటు చేసుకోవడంతో ఆర్థిక సంక్షోభం ఏర్పడిందన్నారు. దీంతో పింఛన్లు పంపిణీ చేయలేక ప్రతిపక్షాలపై నెపం నెట్టుతున్నారని విమ ర్శించారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం వలంటీర్లను కొనసాగిస్తా మంటున్నారని, వారు వైసీపీ అనుకూలంగా పనిచేస్తే నష్టపోతారన్నారు. అనంతరం ఎంపీడీఓ దాసరి మేరీకి వినతిపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీలు ఆదినారాయణ, అశ్వత్థరామప్ప, బొజ్జప్ప, నాయకులు రామాంజనే యులు, ప్రకాష్, నాయకులు రాజగోపాల్, కిష్టప్ప, ఈశ్వర్‌సాగర్, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.