Share News

KESHAV ROAD SHOW: తాగునీరు ఇవ్వలేని విశ్వను ఓడించండి

ABN , Publish Date - Apr 28 , 2024 | 12:12 AM

ఉరవకొండ నియోజకవర్గానికి తాగునీరు కూడా ఇవ్వలేని అసమర్థుడైన విశ్వేశ్వరరెడ్డిని ఓడించాలని ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు పయ్యావుల కేశవ్‌, అంబికా లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు. శనివారం మండలం ఉదిరిపికొండ, శివరాంపేట, ఉదిరిపికొండ తండా, మరుట్ల 3, 2, 1వ కాలనీలతోపాటు ఇప్పేరులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయా గ్రామాల్లో కూటమి అభ్యర్థులకు గజమాలలతో, మహిళల హారతులతో ఘన స్వాగతం పలికారు.

KESHAV ROAD SHOW: తాగునీరు ఇవ్వలేని విశ్వను ఓడించండి
మాట్లాడుతున్న ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌

కూడేరు, ఏప్రిల్‌ 27: ఉరవకొండ నియోజకవర్గానికి తాగునీరు కూడా ఇవ్వలేని అసమర్థుడైన విశ్వేశ్వరరెడ్డిని ఓడించాలని ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు పయ్యావుల కేశవ్‌, అంబికా లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు. శనివారం మండలం ఉదిరిపికొండ, శివరాంపేట, ఉదిరిపికొండ తండా, మరుట్ల 3, 2, 1వ కాలనీలతోపాటు ఇప్పేరులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయా గ్రామాల్లో కూటమి అభ్యర్థులకు గజమాలలతో, మహిళల హారతులతో ఘన స్వాగతం పలికారు. వారు మాట్లాడుతూ తాగునీటి పథకాలను కూడా సక్రమంగా నడపలేని వైసీపీ నాయకులకు ఓటుతో బుద్ధి చెప్పాలన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక అరాచకం పెరిగిపోయిందని, అభివృద్ధి ఏమాత్రం జరగలేదన్నారు. వైసీపీ పాలనలో అన్ని వర్గాల ప్రజలు మోసపోయారని, టీడీపీ అధికారంలోకి రాగానే ఉచిత బస్సు ప్రయాణం, మూడు గ్యాస్‌ సిలిండర్లు, నిరుద్యోగులకు మెగా డీఎస్సీ, విద్యార్థులకు, యువత, మహిళలు, అన్నదాతలకు, కార్మికులతోపాటు అన్ని వర్గాలకు ఆర్థికంగా అభివృద్ధికి అనేక పథకాలను అమలు చేస్తారన్నారు. కూటమి అభ్యర్థులను గెలిపించాలని జనసేన, బీజేపీ నాయకులు కోరారు. జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీధర్‌ చౌదరి, మాజీ ఎంపీపీ బ్రహ్మయ్య, జనసేన నియోజకవర్గ నాయకుడు గౌతం, బీజేపీ జిల్లా నాయకుడు కొనకొండ్ల రాజేష్‌ పాల్గొన్నారు.


టీడీపీలోకి మాజీ సర్పంచ కుటుంబం..

విడపనకల్లు: మండల కేంద్రంలో వైసీపీకి భారీ ఎదురు దెబ్బ తగిలింది. ఆ పార్టీ మాజీ సర్పంచ సుంకన్న సోదరుడు, కొమ్మె ఎర్రిస్వామి, గోపాల్‌, హనుమంతు, గురుస్వామి, కౌకుంట్లలోని పయ్యావుల శ్రీనివాసులు అధ్వర్యంలో శనివారం టీడీపీలోకి చేరారు. వీరికి శ్రీనివాసులు టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సర్పంచ చంద్రశేఖర్‌, మాజీ సర్పంచ సినిమా రామాంజనేయులు, హనుమంతు, టీ రామాంజనేయులు, గోపన్న, సూరి పాల్గొన్నారు.


వార్డు సభ్యుల చేరిక

ఉరవకొండ: పంచాయతీకి చెందిన వైసీపీ వార్డు సభ్యులు టీడీపీలోకి చేరారు. దీంతో ఆ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వైసీపీకి చెందిన నిరంజనగౌడ్‌, వేల్పుల వాసుదేవ్‌, బోయ పద్మావతి, ఆమె భర్త శ్రీనివాసులు ఎమ్మెల్యే కేశవ్‌ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందన్నారు. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి రావడం తథ్యమన్నారు. పార్టీ గెలుపు కోసం కృషిచేయాలని సూచించారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Apr 28 , 2024 | 12:12 AM