Share News

మీకు ఇష్టమైన భాషను ఎంచుకోండి

వైసీపీ ఓటమి ఖాయం

ABN , Publish Date - Mar 04 , 2024 | 12:32 AM

ధర్మవరం, మార్చి 3: వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఖాయంగా కనిపిస్తోందని, ప్రజలంతా టీడీపీకి పట్టం కట్టేందుకు ఎదురు చూస్తున్నారని పార్టీ ధర్మవరం నియోజకవర్గ పరిశీలకుడు నాగేంద్ర, రాష్ట్ర కార్యదర్శి కమతం కాటమయ్య,

వైసీపీ ఓటమి ఖాయం

- జనమంతా తెలుగుదేశం వైపే..

- భవిష్యత్తుకు గ్యారెంటీలో ఆ పార్టీ నాయకులు

ధర్మవరం, మార్చి 3: వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఖాయంగా కనిపిస్తోందని, ప్రజలంతా టీడీపీకి పట్టం కట్టేందుకు ఎదురు చూస్తున్నారని పార్టీ ధర్మవరం నియోజకవర్గ పరిశీలకుడు నాగేంద్ర, రాష్ట్ర కార్యదర్శి కమతం కాటమయ్య, పట్టణ అధ్యక్షుడు పరిశేసుధాకర్‌ పేర్కొన్నారు. పట్టణంలోని 31వ వార్డులో ఆదివారం వారు బాబుష్యూరిటీ- భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు .ఈ సందర్భంగా ఇం టింటికీ వెళ్లి ప్రజలకు మినీమేనిఫెస్టో కరపత్రాలను పంచు తూ ఆ పథకాల గురించి వివరించారు. కుటుంబంలో ఎవరెవరికి ఏయే పథకాలు వర్తిస్తాయి. వాటి వల్ల ఏ మేరకు లబ్ధి చేకూరుతుందో తెలియజేశారు. అనంతరం మాట్లాడుతూ... గత నాలుగున్నరేళ్లకు పైగా వైపీపీ పాలనలో రాష్ట్రంలో అవినీతి రాజ్యం ఏలిందన్నారు. రాష్ట్రాన్ని సీఎం జగన అప్పుల ఆం ధ్రప్రదేశగా మార్చారన్నారు. చాలామంది అర్హులకు సైతం పథకాలు అందించలేదన్నారు. ఎన్నికలకు ముందు చెప్పిన హామీలను వేటినీ జగన నెరవేర్చలేదన్నారు. అందుకే వైసీపీకి తగిన బుద్ధి చెప్పడానికి ఎదరుచూస్తున్నారని తెలిపారు. ప్ర స్తుతం జనం టీడీపీ వైపే ఉన్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీ పీ ఓడిపోవడం, టీడీపీ గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ధర్మవరంలో పరిటాల

శ్రీరామ్‌ను ఎమ్మెల్యే గెలిపించుకోవాలని ప్రజలకు కోరారు. కార్యక్రమంలో నాయకులు భీ మినేని ప్రసాద్‌నాయుడు, శీలామూర్తి, రాళ్లపల్లి షరీఫ్‌, అంబటిసనత, కరెంటు ఆది, గంగారపురవి, గోసలశ్రీరాములు, మా రుతీస్వామి, మాధవరెడ్డి, అత్తార్‌ రహీంబాషా, ఉస్మాన, బీరే శీన, గోపాల్‌, అశ్వర్థనారాయణ, నాగేం ద్ర, తొగట అనిల్‌, బాబావలి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 04 , 2024 | 12:32 AM