వైసీపీ ఓటమి ఖాయం
ABN , Publish Date - Jan 29 , 2024 | 12:08 AM
వైసీపీ ప్రభుత్వం తో ప్రజలంతా విసిగిపోయారని, రానున్న ఎన్నికల్లో ఆ పార్టీ ఓటమి ఖాయమని, చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం గ్యారెంటీ అన్ని మాజీ మంత్రి పరిటాల సునీత ధీమా వ్యక్తం చేశారు.
రామగిరి, జనవరి 28: వైసీపీ ప్రభుత్వం తో ప్రజలంతా విసిగిపోయారని, రానున్న ఎన్నికల్లో ఆ పార్టీ ఓటమి ఖాయమని, చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం గ్యారెంటీ అన్ని మాజీ మంత్రి పరిటాల సునీత ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం సాయంత్రం మండలంలోని నసనకోట పంచాయతీలోని గంగంపల్లి గ్రామంలో బాబు ష్యూరిటీ - భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో భాగం గా ఆమె గ్రామస్థులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. టీడీపీ మిని మ్యానిపేస్టో పథకాలను వివరించారు. వైసీపీ ప్రభుత్వం నవరత్నాల పేరుతో కొందరికే సంక్షేమాన్ని అందించి.. మరికొందరికి అన్యాయం చేసింద న్నారు. ఈ రాష్ట్రాన్ని ఎవరూ కాపాడలేని పరిస్థితికి తీసుకెళ్లారన్నారు. గతంలో సీఎం జగన జిల్లాకు వచ్చినప్పుడు బటన నొక్కి ఇన్సురెన్స ఇస్తామన్నారే కానీ.. ఖాతాలోకి మాత్రం డబ్బులు పడలేదన్నారు. ఇప్పుడు ఆసరా పేరుతో ఉరవకొండలో బటన నొక్కి వెళ్లారని... కానీ మహిళల ఖాతాలోకి డబ్బులు పడలేదని అన్నారు. ఇలా మోసం చేస్తున్న ప్రభుత్వానికి తగిన విధంగా బుద్ధిచెప్పాలన్నారు. కార్యక్రమంలో నాయ కులు రామ్మూర్తి నాయుడు, నాయకులు శ్రీధర్ నాయుడు, పోతన్న, గంగాధర్, శ్రీనివాసులు, అనిల్‌కుమార్, శ్రీనివాసులు, ఆదినారాయణ పాల్గొన్నారు.