Share News

ఆంధ్రా రంజీ జట్టుకు దత్తారెడ్డి

ABN , Publish Date - Feb 17 , 2024 | 12:59 AM

ఆంధ్రా రంజీ జట్టుకు జిల్లాకు చెందిన ఎంఏ దత్తారెడ్డి ఎంపికయ్యాడు. రైట్‌హ్యాండ్‌ బ్యాటర్‌ అయిన ఈయన ఇదివరకే అండర్‌-12, 14, 16 కేటగిరీల్లో ఆంధ్రా జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. తాజా గా ఆంధ్రా అండర్‌-19 జట్టులో ఈ సీజనలో మొత్తం 465 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 172 పరుగులు.

ఆంధ్రా రంజీ జట్టుకు దత్తారెడ్డి

పరుగుల వదర పారిస్తున్న క్రికెటర్‌

అనంతపురం క్లాక్‌టవర్‌, ఫిబ్రవరి 16: ఆంధ్రా రంజీ జట్టుకు జిల్లాకు చెందిన ఎంఏ దత్తారెడ్డి ఎంపికయ్యాడు. రైట్‌హ్యాండ్‌ బ్యాటర్‌ అయిన ఈయన ఇదివరకే అండర్‌-12, 14, 16 కేటగిరీల్లో ఆంధ్రా జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. తాజా గా ఆంధ్రా అండర్‌-19 జట్టులో ఈ సీజనలో మొత్తం 465 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 172 పరుగులు. నగరానికి చెందిన మచ్చా రామలింగారెడ్డి, లక్ష్మి దంపతుల ఏకైక కుమా రుడైన దత్తారెడ్డి ఆంధ్రా రంజీ జట్టులో స్థానం సాధించిన జిల్లాకు చెందిన 12వ ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఈయన తదుపరి మ్యాచలకు జట్టులో చేరే అవకాశం ఉంది. ఆంధ్రా ప్రీమియర్‌ లీగ్‌లో కోస్టల్‌ రైడర్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.

వికెట్‌ కీపర్‌.. బ్యాట్స్‌మన

దత్తారెడ్డికి చిన్నప్పటి నుంచి క్రికెట్‌ అంటే మక్కువ ఎక్కువ. ప్రస్తుతం ఈయన ఎస్‌ఎ్‌సబీఎన డిగ్రీ-పీజీ కళాశాలలో ఫైనలి యర్‌ డిగ్రీ చదువుతున్నాడు. ఇప్పటి వరకు ఆంధ్రా జట్టు తరపున ఆయా కేటగిరీలలో సుమారు 50 మ్యాచలు ఆడిన దత్తారెడ్డి తన ప్రతిభతో ఆంధ్రా రంజీ జట్టు సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు.

అభినందనలు

ఆంధ్రా రంజీ జట్టులో స్థానం సాధించిన ఎంకే దత్తారెడ్డికి ఆర్డీటీ ప్రోగ్రాం డైరెక్టర్‌ మాంచో ఫెర్రర్‌, జిల్లా క్రికెట్‌ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు ప్రకా్‌షరెడ్డి, మధు ఆచారి అభినందనలు తెలిపారు. వారితో పాటు ఆర్డీటీ అధికారులు, కోచలు, తోటి క్రీడాకారులు దత్తారెడ్డిని అభినందించారు. భారత జట్టులో స్థానం సాధించి జిల్లా పేరు ప్రతిష్టలు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఇనుమడింప చేయాలని ఆకాంక్షించారు.

Updated Date - Feb 17 , 2024 | 12:59 AM