Share News

చీకటి జీఓలు ఎప్పటికైనా మంటగలవాల్సిందే

ABN , Publish Date - Jan 14 , 2024 | 11:45 PM

వైసీపీ ప్రభుత్వం చీకటి జీఓలు తెచ్చి ప్రతిపక్షాలను భయపెట్టాలని చూస్తే, అది ముమ్మాటికి సాధ్యం కాదని, చీకటి జీఓ ఎప్పటికైనా భోగి మంటల్లో కలవాల్సిందేనని మాజీ ఎమ్మెల్యే మ ద్దనకుంట ఈరన్న అన్నారు.

చీకటి జీఓలు ఎప్పటికైనా మంటగలవాల్సిందే
జీఓ ప్రతులను భోగి మంటల్లో వేస్తున్న మాజీ ఎమ్మెల్యే ఈరన్న

మాజీ ఎమ్మెల్యే మద్దనకుంట ఈరన్న

మడకశిరటౌన, జనవరి 14: వైసీపీ ప్రభుత్వం చీకటి జీఓలు తెచ్చి ప్రతిపక్షాలను భయపెట్టాలని చూస్తే, అది ముమ్మాటికి సాధ్యం కాదని, చీకటి జీఓ ఎప్పటికైనా భోగి మంటల్లో కలవాల్సిందేనని మాజీ ఎమ్మెల్యే మ ద్దనకుంట ఈరన్న అన్నారు. పట్టణంలోని టీడీపీ కార్యాలయ ఆవరణంలో ఆదివారం మాజీ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో భోగి సంకల్పం కార్యక్రమాన్ని ని ర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాష్ట్ర సమస్యల ఫొటోలు, సీఎం జగనమోహనరెడ్డి అబద్ధపు హామీలు, జగన చేసిన దారు ణాలను, వాటి ప్రతులను భోగి మంటల్లో వేసి తగలబెట్టామని పేర్కొన్నా రు. వచ్చే సంవత్సరం అందరం కలిసికట్టుగా ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించి, చంద్రబాబునాయుడును ముఖ్యమంత్రిగా చేసుకోవాలన్నారు. అప్పుడు ఆనందంగా సంక్రాంతిని జరుపుకుందామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

రాష్ట్రం బాగుండాలంటే జగన ఇంటికిపోవాలి..

రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలంటే సీఎం జగన దిగి పోవాలని టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి నాగరాజు, మైనారిటీ జిల్లా అధ్య క్షుడు భక్తర్‌ పేర్కొన్నారు. వారు ఆదివారం పట్టణంలోని బాలాజీ నగర్‌లో ఉన్న టీడీపీ కార్యాలయంలో భోగి సంకల్పం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ప్రభుత్వం విపక్షాలను అణచడానికి తెచ్చిన జీఓ ప్రతులను బోగ మంటల్లో తగలబెట్టినట్లు తెలిపారు. ప్రభు త్వం చీకటి జీవోలను తీసుకొచ్చి విపక్షాలను, ప్రజలను అనేక ఇబ్బందుల కు గురి చేస్తున్నారని, మంటల్లో తగలబెట్టడానికే తప్ప అవి వేటికీ ఉపయోగకరం కావన్నారు. కార్యక్రమంలో టీడీపీ పట్టణాధ్యక్షుడు మనో హర్‌, మున్సిపల్‌ మాజీ చైర్మన సుబ్బరాయుడు, మండల కన్వీనర్‌ లక్ష్మీ నారాయణ, కౌన్సిలర్‌ ఉమాశంకర్‌, నాయకులు చంద్రప్ప, సన్నీరప్ప, తిమ్మరాజు, అక్కంపల్లి బాబు, కట్టాకిషోర్‌, మల్లికార్జున, రవికుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 14 , 2024 | 11:45 PM