దక్షిణ కాశీగా హెంజేరు సిద్దేశ్వరాలయం
ABN , Publish Date - Mar 08 , 2024 | 12:41 AM
అమరాపురం మండలం హేమావతిలో వెలసిన హెంజేరు సిద్దేశ్వరస్వామి ఆల యం దక్షిణకాశీగా ప్రసిద్ధి చెందింది. భక్తుల కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా స్వామి వెలుగొందుతున్నారు.
విగ్రహరూపంలో వెలసిన శివుడు
నేటి నుంచి బ్రహ్మోత్సవాలు
మడకశిర టౌన, మార్చి5: అమరాపురం మండలం హేమావతిలో వెలసిన హెంజేరు సిద్దేశ్వరస్వామి ఆల యం దక్షిణకాశీగా ప్రసిద్ధి చెందింది. భక్తుల కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా స్వామి వెలుగొందుతున్నారు. అమరాపురం మండల కేంద్రానికి 11 కిలోమీటర్ల దూరం లో హేమావతి హెంజేరు సిద్ధేశ్వరాలయం ఉంది. పవి త్ర పుణ్యక్షేత్రంగా పేరొందిన ఈ ఆలయంలో స్వామి విగ్రహరూపంలో దర్శనమిస్తున్నాడు. అలాగే రుండ మాలధరుడిగా ఉండడం విశేషం. సూర్యాస్తమయం సమయంలో స్వామి నుదుటిపై సూర్యుడి కాంతి పడి ఆలయంలో వెలుగులు విరజిల్లడం ఇక్కడి ప్రత్యేకత. ఈ ఆలయాన్ని చోళరాజుల పాలనలో నిర్మించినట్లు ఇక్కడి శాసనాల ఆధారాల ద్వారా తెలుస్తోంది. ఈ ప్రాంతాన్ని ఏలిన నొళమాంబ రాజుల పాలనలో ఆ గ్రామాన్ని హెంజేరుగా పిలిచేవారు. నిడగల్, రత్నగిరి సంస్థానాలకు ముఖ్యపట్టణంగా ఉన్న ఈ గ్రామంలో సాంస్కృతిక విశ్వ విద్యాలయం నెలకొల్పినట్లు తెలుస్తోంది. సామంత రాజుల పాలనలో సీతాదేవి అనే మహారాణి ఒక రోజు ఇంట్లో వంటలు చేస్తుం డగా వచ్చేపొగ బంగారు రంగులో కనబడడంతో హైమావతిగా ప్రసిద్ధికెక్కినట్టు స్థానిక కథనం తెలుపుతోంది. హైమ అనగా బంగారం, వతి అనగా మహిళ. రానురాను హైమావతి హేమావతిగా రూపాంతరం చెందినట్లు చెబుతున్నారు..
పంచలింగాలకు ప్రసిద్ధి : హేమావతి గ్రామంలో దొడ్డేశ్వర, మల్లేశ్వర, విరుపా క్షేశ్వర దేవాలయాలు హెంజేరు సిద్దేశ్వరాలయం ఆవరణంలో ఉన్నాయి. చిత్రేశ్వర, సోమేశ్వరాలయాలు బోయ వీధిలో ఉన్నాయి. ఆ రెండు ఆలయాలు సిద్దేశ్వరాల యం ఆవరణంలో లేకపోవడంతో నిరాదారణకు గురవుతున్నాయి. ఆధ్యాత్మికతకు, శిల్పకళకు ఈ దేవాలయాలు ప్రతీకగా నిలిచాయి. సిద్దేశ్వర, దొడ్డేశ్వరస్వామి దేవా లయాలు పడమర ముఖద్వారం కలిగి ఉండడం ఇక్కడి మరో ప్రత్యేకత. సిద్దేశ్వరా లయం సమీపంలో కళ్యాణి బావి, నవకోటమ్మ ఆలయాలున్నాయి. కల్యాణి బావిలో స్నానం చేస్తే దీర్ఘకాలిక రోగాలు నయమవుతాయని భక్తుల విశ్వాసం.
ఆలయ విశిష్టత : దక్షిణభారతీయ వాస్తు, శిల్పపరంగా హేమావతి సిద్దేశ్వ రాలయం విశిష్ట స్థానం పొందింది. దీనిని దక్షిణ కాశీగా పిలిచేవారు. ఇక్కడ శివుడు పీఠంపై ఆశీనుడైన 5.8 అడుగుల ఎత్తు విగ్రహంరూపంలో వెలిశాడు. ఆలయంలో నల్లనిరాతితో చేసిన శివలింగాలు, శివుడికి ఎదురుగా ఉన్న మండ పంలో గంభీరంగా లేచి వస్తున్నట్లుగా చూపరులను ఆకట్టుకునే నందివిగ్రహాలను చూడవచ్చు. ఆలయం 14 ఎకరాల విస్తీర్ణంలో ఉద్యానవనంతో ఎంతో ఆహ్లాదాన్ని స్తుంది. ఇప్పటికీ గ్రామ పరిసరాలలో ఎక్కడ తవ్వకాలు జరిపినా శివలింగాలు, ధ్వ జస్తంభాలు, నంది విగ్రహాలు బయటపడుతుంటాయని స్థానికులు చెబుతున్నా రు. గర్భగుడులు చతురాస్రాకారంలో ఉండి అర్దమండపం వాసరా ఉంటుంది. ఆలయాల గోడలపై వివిధ జీవుల ఆకృతులు చెక్కారు. స్తంభాలు, నంది విగ్రహా లు, శివలింగాలన్నిటినీ నల్లటి రాతితో చెక్కారు. ధ్వజస్తంభాలపై రామాయణ, మహా భారత ఘట్టాలను మలిచారు. ఆలయంలో గాలి, వెలు తురు వచ్చే విధంగా కిటికీలు, గవాక్షలు ఏర్పాటుచేశారు. కిటికీలలో గంగ, బ్రహ్మ, విష్ణు, కార్తీకేయ, మిథున శిల్పాలు చూడవచ్చు. వాసరాలలో అష్టదిక్పాలకులను ప్రతిష్ఠించారు. నొళంబుల శిల్పకళ సౌందర్యానికి దొడ్డేశ్వరస్వామి ఆలయం ప్రతీకగా నిలిచింది.
నేటి నుంచి బ్రహ్మోత్సవాలు
హెంజేరు సిద్ధేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ప్రతి యేటా మహాశివరాత్రి పర్వదినంతో మొదలవుతాయి. ఆ మాదిరిగానే శుక్రవారం స్వామి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. వాటి వివరాలను ఆలయ కమిటీ ఇలా తెలియజేశారు. స్వామికి శుక్రవారం మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు, శనివారం స్వామికి బానుపల్లకి, పూజలు, భజనలు కీర్తనలు నిర్వహి స్తారు. అలాగే 10న అగ్నిగుండ మహోత్సవం వైభవంగా జరుగనుంది. 11న సిడి మాను ఉత్సవం, 12న చిన్నరథోత్సవం, 13న బ్రహ్మరథోత్సవం, 14న వసంతోత్స వం, 15న శయనోత్స వం నిర్వహిస్తారు. అగ్నిగుండ మహోత్సవానికి ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలి వస్తారు.