Share News

సీపీఐఎంఎల్‌ రాష్ట్ర కమిటీ సభ్యుడు పెద్దన్న మృతి

ABN , Publish Date - Jan 14 , 2024 | 11:56 PM

సీపీఐఎంఎల్‌ రాష్ట్ర కమిటీ సభ్యుడు, ఏఐఎ్‌ఫటీయూ రాష్ట్ర అధ్యక్షుడు పెద్దన్న గుండెపోటుతో ఆదివారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో మృతి చెందారు.

సీపీఐఎంఎల్‌ రాష్ట్ర కమిటీ సభ్యుడు పెద్దన్న మృతి

ఫనివాళులర్పించిన సీపీఐ, సీపీఎం,

ప్రజాసంఘాల నేతలుఅనంతపురం క్లాక్‌టవర్‌, జనవరి 14: సీపీఐఎంఎల్‌ రాష్ట్ర కమిటీ సభ్యుడు, ఏఐఎ్‌ఫటీయూ రాష్ట్ర అధ్యక్షుడు పెద్దన్న గుండెపోటుతో ఆదివారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో మృతి చెందారు. పెద్దన్న.. తరిమెల నాగిరెడ్డి సారథ్యంలో పనిచేశారు. ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి, పూర్తిగా ప్రజా ఉద్యమం కోసం కృషి చేశారు. నగరంలో ఇల్లు లేని నిరుపేదలకు యువజన కాలనీతో మొదలుకొని స్టాలిన, రజకనగర్‌, మండ్ల సుబ్బారెడ్డి నగర్‌ వరకూ వేలాది మందికి ఇంటి వసతి కల్పించారు. ఎన్జీఓ నాయకుడిగా ఉద్యోగుల హక్కుల సాధన కోసం ఆయన చేసిన కృషి మరువలేనిది. పంచాయతీరాజ్‌ శాఖలో పంప్‌ మెకానిక్‌ల రాష్ట్ర సంఘాన్ని, తెలుగు గంగ హెచఆర్‌ వర్కర్స్‌ యూనియనకు సారథ్యం వహించిన ఘనత ఆయనది. ఆయిల్‌ఫెడ్‌ కార్మికులు, హమాలీలను ఆర్గనైజ్‌ చేసి రజక వృత్తిదారుల సంఘాలకు బాసటగా నిలిచారు. రెండు సంవత్సరాలుగా గుండె సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చివరి క్షణం వరకూ ప్రజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆయన మృతికి సీపీఐఎంఎల్‌, ఏఐఎ్‌ఫటీయూ నాయకులు నివాళులర్పించారు. ఎంపీ రంగయ్య, ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి, డీఎస్పీ ఆర్ల శ్రీనివాసులు, సీపీఎం నేతలు ఓబులు, రాంభూపాల్‌, సీపీఐ నేతలు ఎంవీ రమణ, శ్రీరామలు, అల్లీపీరా, సీపీఐఎంఎల్‌ న్యూడెమోక్రసీ ఇండ్ల ప్రభాకర్‌ రెడ్డి, టీడీపీ నాయకులు సరిపూటి రమణ, స్త్రీ విముక్తి సంఘటన జిల్లా కార్యదర్శి మల్లీశ్వరి, ఏపీఎ్‌ఫటీయూ రాష్ట్ర కార్యదర్శి కిశోర్‌కుమార్‌, నాయకులు స్వామి, తరిమెల నాగిరెడ్డి ట్రస్టు సభ్యుడు సుధీర్‌కుమార్‌, కర్ణాటక రాజ్య రైతు సంఘం నాయకులు.. పెద్దన్న మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

Updated Date - Jan 14 , 2024 | 11:56 PM