Share News

ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా జరగాలి

ABN , Publish Date - May 24 , 2024 | 11:58 PM

ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రశాంతంగా జరిగేలా అన్ని పార్టీలు సహకరించాలని జిల్లా కలెక్టర్‌ వినోద్‌కుమార్‌ పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవనలో ఎన్నికల ఓట్ల లెక్కింపు, ఇతర అంశాలపై అభ్యర్థులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు, జిల్లా ఎస్పీ గౌతమి శాలితో కలిసి ఆయన సమావేశం నిర్వహించారు.

ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా జరగాలి

ఫ అన్ని పార్టీలు సహకరించాలి ఫ సంబరాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవు : కలెక్టర్‌

అనంతపురం అర్బన, మే 24: ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రశాంతంగా జరిగేలా అన్ని పార్టీలు సహకరించాలని జిల్లా కలెక్టర్‌ వినోద్‌కుమార్‌ పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవనలో ఎన్నికల ఓట్ల లెక్కింపు, ఇతర అంశాలపై అభ్యర్థులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు, జిల్లా ఎస్పీ గౌతమి శాలితో కలిసి ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియలో ప్రశాంతతను కాపాడాలన్నారు. ఎన్నికల కమిషన నిబంధనల మేరకు ఓట్ల లెక్కింపు ఏర్పాట్లు చేపడుతున్నామన్నారు. ఫలితాలను సామరస్యంగా తీసు కోవాలని, జిల్లాలో 144 సెక్షన అమలులో ఉందన్నారు. 133 సెక్షన కింద ఇతరులకు హాని కలిగించే రాళ్లు, రప్పలు, కర్రలు తదితర వస్తువులను ఎవ్వరూ దగ్గర ఉంచుకోరాదన్నారు. లెక్కింపు పూర్తైన తర్వాత బాణ సంచా కాల్చడం, సంబరాలు చేసుకోరాదన్నారు. లెక్కింపు కేంద్రాల్లో ఏజెంట్‌ రూమ్‌ ఏర్పాటుతోపాటు టవర్‌ ఏసీలు ఏర్పాటు చేస్తున్నా మన్నారు. శాంతి భద్రతలకు భంగం కలిగించరాదన్నారు. జిల్లా ఎస్పీ గౌతమి శాలి మాట్లాడుతూ... ఓట్ల లెక్కింపులో ఎలాంటి హింసకు తావివ్వరాదన్నారు. ఎవరైనా ఎలాంటి హింస సృష్టించినా, సృష్టించాలని ప్రేరేపించినా కేసులు నమోదు చేస్తామన్నారు. లా అండ్‌ ఆర్డర్‌ను ఎవరూ చేతుల్లోకి తీసుకోవడానికి వీల్లేదన్నారు. ఓట్ల లెక్కింపునకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు. జిల్లా కలెక్టర్‌ ఆదేశాలతో 8 మందిని జిల్లానుంచి బహిష్కరించామన్నారు. గొడవలు చేసేందుకు ఆస్కారం ఉన్న వారిని బైండోవర్‌ చేస్తున్నామని, ఈ ప్రక్రియ ఇంకా కొనసాగుతుందన్నారు. కార్యక్రమంలో నగర కమిషనర్‌ మేఘస్వరూప, జడ్పీ సీఈఓ నిదియాదేవి, అసిస్టెంట్‌ కలెక్టర్‌ వినూత్న, డీఆర్‌ఓ రామకృష్ణారెడ్డి, ఏఎస్పీ విజయ భాస్కర్‌రెడ్డి, రిటర్నింగ్‌ అధికారులు, పార్లమెంట్‌ నియోజకవర్గం ఏఆర్‌ఓలు, అభ్యర్థులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు హాజరయ్యారు.

Updated Date - May 24 , 2024 | 11:58 PM