Share News

MINISTER SAVITA : నగర పంచాయతీ అభివృద్ధికి సహకారం అందిస్తా

ABN , Publish Date - Jun 27 , 2024 | 12:01 AM

నగర పంచాయతీ అభివృద్ధికి తన సంపూర్ణ సహ కారం అందిస్తామని... పారిశుధ్యం, మంచినీ రు, వీధి దీపాలకు మొదటి ప్రాధాన్యత కల్పిస్తానని రాష్ట్ర బీసీ సంక్షేమం, చేనేత జౌ ళిశాఖ మంత్రి సవిత పేర్కొన్నారు. స్థానిక నగర పంచాయతీ కార్యాలయం వద్ద బుధవారం రూ.47 లక్షల విలువచేసే నూతన చెత్త సేకరణ వాహనం ప్రారంభో త్సవానికి ముఖ్య అతిథిగా సవిత హాజర య్యారు. మంత్రికి నగర పంచాయతీ కమిష నర్‌ వంశీకృష్ణ భార్గవ, చైర్మన ఉమర్‌ఫా రూక్‌, వైస్‌ చైర్మన అనీల్‌కుమార్‌, నందినిరెడ్డి, పాలకవర్గ సభ్యులు పుష్పగుచ్ఛాన్ని అందించి పూలమాలలువేసి, శాలువను కప్పి ఘనస్వాగతం పలికారు.

MINISTER SAVITA : నగర పంచాయతీ అభివృద్ధికి సహకారం అందిస్తా
Minister Savita inaugurating the vehicle

బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత

రూ.47లక్షల విలువచేసే

చెత్త సేకరణ వాహనం ప్రారంభం

పెనుకొండ, జూన 26: నగర పంచాయతీ అభివృద్ధికి తన సంపూర్ణ సహ కారం అందిస్తామని... పారిశుధ్యం, మంచినీ రు, వీధి దీపాలకు మొదటి ప్రాధాన్యత కల్పిస్తానని రాష్ట్ర బీసీ సంక్షేమం, చేనేత జౌ ళిశాఖ మంత్రి సవిత పేర్కొన్నారు. స్థానిక నగర పంచాయతీ కార్యాలయం వద్ద బుధవారం రూ.47 లక్షల విలువచేసే నూతన చెత్త సేకరణ వాహనం ప్రారంభో త్సవానికి ముఖ్య అతిథిగా సవిత హాజర య్యారు. మంత్రికి నగర పంచాయతీ కమిష నర్‌ వంశీకృష్ణ భార్గవ, చైర్మన ఉమర్‌ఫా రూక్‌, వైస్‌ చైర్మన అనీల్‌కుమార్‌, నందినిరెడ్డి, పాలకవర్గ సభ్యులు పుష్పగుచ్ఛాన్ని అందించి పూలమాలలువేసి, శాలువను కప్పి ఘనస్వాగతం పలికారు. అనంతరం మంత్రి వాహనాన్ని పూజలు చేసి రిబ్బనకట్‌ చేసి ప్రారంభించారు. అనంతరం వా హనాన్ని ఆమె స్వయంగా నడిపారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ పె నుకొండ నియోజకవర్గం ప్రజలు తనను అత్యధిక మెజార్టీతో గెలిపించి మంత్రిని చేశారని వారికి ఎల్లవేళలా రుణపడి ఉంటానన్నారు.


పెనుకొండ చరిత్రలో పెను కొండ పట్టణంలో ఎన్నడూరాని మెజార్టీ తనకు ఇచ్చారని ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. నగర పంచాయతీ, నియోజకవర్గాన్ని అభి వృద్ధి బాటలో తీసుకెళ్దామన్నారు. నగర పంచాయతీకి ప్రభుత్వపరంగా ప్రత్యేక నిధులు తెచ్చుకుని అభివృద్ధి పనులు చేపడదామన్నారు. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచాలనే ఉద్దేశంతో పెనుకొండలోని ప్రధాన కేంద్రాల్లో చెత్త కుండీలు ఏర్పాటు చేయడంతోపాటు చెత్తను తరలించడానికి కొత్తగా వాహనాన్ని ఏర్పాటు చేశామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ప్రత్యేక నిధులు తెచ్చుకుని పెనుకొండ రూపురేఖలు మార్చుదామన్నారు. జూలై 1న ప్రతి ఇంటికీ వెళ్లి చంద్రబాబు ఇచ్చిన హామీమేరకు కొత్తగా రూ.4వేలు పెన్షన తోపాటు మూడునెలల బకాయిలు రూ.3వేలు కలిపి రూ.7వేలు చెల్లిస్తారన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకో వడం టీడీపీకే చెల్లుతుందన్నారు. జగనరెడ్డి పెన్షన పెం చి వాయిదాలతో ఐదేళ్లు గడిపి ప్రజలను మోసం చేశాడన్నారు. ప్రజలకు అన్ని వేళలా అందుబాటులో ఉండి వారి సమస్యలను పరిష్కరిస్తామన్నారు. అనంతరం అభివృద్ధి పనులపై నగర పంచాయతీ పాలకవర్గ సభ్యులతో సమావేశమయ్యారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Jun 27 , 2024 | 12:01 AM