Share News

కాంట్రాక్టర్‌ శివశంకర్‌రెడ్డిని బ్లాక్‌లిస్టులో పెట్టాలి

ABN , Publish Date - May 27 , 2024 | 12:19 AM

నీలకంఠాపురం శ్రీరామిరెడ్డి తాగునీటి పథకంలో పనిచేస్తున్న కార్మికులకు అన్యాయం చేస్తున్న కాంట్రాక్టర్‌ శివశంకర్‌రెడ్డిని బ్లాక్‌ లిస్టులో పెట్టాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఓబులు డిమాండ్‌ చేశారు.

కాంట్రాక్టర్‌ శివశంకర్‌రెడ్డిని బ్లాక్‌లిస్టులో పెట్టాలి

అనంతపురం కల్చరల్‌, మే 26: నీలకంఠాపురం శ్రీరామిరెడ్డి తాగునీటి పథకంలో పనిచేస్తున్న కార్మికులకు అన్యాయం చేస్తున్న కాంట్రాక్టర్‌ శివశంకర్‌రెడ్డిని బ్లాక్‌ లిస్టులో పెట్టాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఓబులు డిమాండ్‌ చేశారు. ఆదివారం జేవీవీ జిల్లా కార్యాలయంలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేంద్రకుమార్‌ అధ్యక్షతన నిర్వహించిన రౌండ్‌టేబుల్‌ సమావేశంలో ఆయన మాట్లాడారు. శాశ్వత పనులకు శాశ్వత పరిష్కారం చూపాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. కరువు జిల్లాలో శ్రీరామిరెడ్డి తాగునీటి పథకం ద్వారా 650 గ్రామాలకు తాగునీరు సరఫరా చేస్తూ 600 మంది కార్మికులు తమ కుటుంబాలను పోషించుకుంటున్నారని తెలిపారు. 15 సంవత్సరాలుగా కార్మికులు పనిచేస్తున్న ప్పటికీ వేతనాలు పెంచకపోవడం బాధాకరమన్నారు. మూ డు ప్రభుత్వాలు మారినా కార్మికుల జీవితాల్లో ఎలాంటి మార్పూ రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికశాఖ, ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారుల నిర్లక్ష్యం కారణంగా కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. కాంట్రాక్టర్లకు ఆర్‌డ బ్ల్యూఎస్‌ అధికారులు అనుకూలంగా వ్యవహరిస్తూ బినామీ కార్మికులను చూపించి కోట్లాది రూపాయలు ప్రభుత్వ ధనాన్ని కొల్లగొడుతున్నారన్నారు. సమస్యల న్నింటికీ ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ అవినీతే కారణమని, ఆయనపై వెంటనే విచారణ చేపట్టాలని డిమాండ్‌ చేశారు. సమ్మె నేపథ్యంలో అధికారులు హామీలిచ్చి కొంతమేర వేతనాలిచ్చి సమ్మె విరమింపజేయడం, యదావిధిగా వేతనాలు బకా యిపెట్టడం, కార్మికులు రోడ్లు ఎక్కాల్సి రావడం పరిపాటిగా మారిందని విమర్శించారు. ఇప్పటికైనా కార్మికులకు బకాయి వేతనాలు, పీఎఫ్‌ తక్షణమే చెల్లిం చాలని కోరారు. కార్మికుల పట్ల దురుసుగా వ్యవహరిస్తున్న కాంట్రాక్టర్‌ శివశంకర్‌రెడ్డిపై క్రిమినల్‌ కేసు పెట్టేలా చర్యలు తీసుకుని, ఆయన అక్రమాలపై విచారణ చేపట్టాలని, కాంట్రాక్ట్‌ లైసెన్సను బ్లాక్‌లిస్టులో పెట్టాలని డిమాండ్‌ చేశారు. అదే విధంగా కార్మికులపై బనాయించిన అక్రమ కేసులన్నింటినీ ఎత్తివేయాలన్నారు. నిరసనల సమయంలో కలెక్టర్‌ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కోరారు. కార్మికుల సమస్యలపై ప్రభుత్వం స్పందించకపోతే మళ్లీ సమ్మెలోకి వెళ్లడం ఖాయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏజీటీయూసీ, ఐఎ్‌ఫటీయూ నాయకులు మల్లికార్జున, ఏసురత్నం, ఏపీ రైతుసంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి, ఎస్‌ ఎఫ్‌ఐ నాయకుడు భీమేష్‌, సీఐటీయూ జిల్లా అధ్యక్షురాలు నాగమణి, నగర కార్యదర్శి వెంకట నారాయణ, శ్రీరామిరెడ్డి తాగునీటి పథకం కార్మికుల యూనియన జిల్లా అధ్యక్షుడు ఎర్రిస్వామి, కోశాధికారి వన్నూరుస్వామి, గంగాధర్‌, రామాంజనేయులు పాల్గొన్నారు.

Updated Date - May 27 , 2024 | 12:19 AM