Share News

తాగునీటి కోసం మహిళల ఆందోళన

ABN , Publish Date - Jan 17 , 2024 | 11:52 PM

పట్టణంలోని చౌడేశ్వరీ కాలనీలో నెలకొన్న తాగునీటి సమస్యను పరిష్కరించాలంటూ ఆ కాలనీ మహిళలు డిమాండ్‌ చేశారు.

తాగునీటి కోసం మహిళల ఆందోళన
ఖాళీ బిందెలతో ధర్నా చేస్తున్న మహిళలు

గోరంట్ల, జనవరి 17: పట్టణంలోని చౌడేశ్వరీ కాలనీలో నెలకొన్న తాగునీటి సమస్యను పరిష్కరించాలంటూ ఆ కాలనీ మహిళలు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు వారు స్థానిక ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఖాళీ బిందెలతో బుధవారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.... కాలనీలో అధికంగా ఉన్నాయంటూ పంచాయతీ వారు దాదాపు ఒకటిన్నర నెల క్రితం పబ్లిక్‌ కొళా యలు తొలగించారన్నారు. దీంతో తాము తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎ దుర్కొంటున్నామని కాలనీ వాసులు జనసేన నాయకులకు వివరించామన్నారు. వారు కాలనీలో తొలగించిన కొళాయిల ప్రాంతాలను పరిశీలించారని తెలిపారు. జనసేన ఆధ్వర్యంలో ఖాళీ బిందెలతో ధర్నా చేపట్టినట్లు కాలనీ మహిళలు తెలి పారు. దీంతో ఎంపీడీఓ రఘునాథ్‌గుప్త, పంచాయతీ గుమస్తా సాయి సజయ్‌ ఆందోళన కారుల వద్దకు వచ్చి వారితో చర్చించారు. కాలనీలో ఇష్టారాజ్యంగా కొళా యిలు ఏర్పాటు చేసుకోవడం, ఆ కొళాయిల నుంచి నేరుగా రబ్బరు పైపులతో ఇళ్లలోకి నీరు తీసుకోవడంతో ఇతర ప్రాంతాలకు నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడిందని తెలిపారు. దీంతో కొళాయిలు తొలగించినట్లు అధికారులు వారికి వివరించారు. ఈ సందర్భంగా కాలనీ మహిళలు మూడు ఇళ్లకు ఒక పబ్లిక్‌ కొళాయి వేయాలని డిమాండ్‌ చేశారు. కానీ ఐదు ఇళ్లకు ఒక కొళాయి వంతున గురువారం ఏర్పాటు చేస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు సంతోష్‌, సురేష్‌, వెంకటేష్‌, అనిల్‌, నగేష్‌, తిరుపాల్‌, మహిళలు పాల్గొన్నారు.

Updated Date - Jan 17 , 2024 | 11:52 PM