Share News

orders: 13లోగా బదిలీలు పూర్తి చేయండి: కలెక్టరు

ABN , Publish Date - Sep 10 , 2024 | 12:43 AM

బదిలీల ప్రక్రియను ఈనెల 13 లోగా పూర్తి చేయాలని అధికారులను కలెక్టరు వినోద్‌కుమార్‌ ఆదేశించారు.సోమవారం ‘ఆంధ్రజ్యోతి’లో ఏంటో ఇదంతా శీర్షికన బదిలీలో నెలకొన్న అయోమయ పరిపరిస్థితులపై ఓ కథనం ప్రచురితమైంది. దీనికి కలెక్టరు స్పందించి అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి బదిలీలపై స్పష్టమైన ఆదేశాలిచ్చారు.

orders: 13లోగా బదిలీలు పూర్తి చేయండి: కలెక్టరు

అనంతపురం టౌన, సెప్టెంబరు 9: బదిలీల ప్రక్రియను ఈనెల 13 లోగా పూర్తి చేయాలని అధికారులను కలెక్టరు వినోద్‌కుమార్‌ ఆదేశించారు.సోమవారం ‘ఆంధ్రజ్యోతి’లో ఏంటో ఇదంతా శీర్షికన బదిలీలో నెలకొన్న అయోమయ పరిపరిస్థితులపై ఓ కథనం ప్రచురితమైంది. దీనికి కలెక్టరు స్పందించి అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి బదిలీలపై స్పష్టమైన ఆదేశాలిచ్చారు. ప్రభుత్వ నిబంధనల మేరకు ఎవరెవరిని బదిలీ చేయాలో వారి జాబితాను తొలుత తయారు చేసి వెయిటింగ్‌ ఫర్‌ పోస్టింగ్స్‌ ఉంటే అలాంటి వారికి మొదటి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. అనంతరం ఉన్న ఖాళీల వివరాలను కార్యాలయాలలో ప్రదర్శించాలన్నారు. జిల్లా అధికారుల స్థాయిలో జరిగే బదిలీలు అన్నీ పూర్తి చేయాలని, ఎక్కడైనా సందేహాలు, సమస్యలు ఏర్పడితే డీఆర్‌ఓ లేదా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజలు, రైతులకు తెలిసేలా ప్రతి గురువారం ఉదయం 7-45గంటలనుంచి 8-15వరకు ఆల్‌ఇండియా రేడియోలో కార్యక్రమాలు నిర్వహించాలని, ఇందులో ఆయాశాఖల జిల్లా అధికారులు పాల్గొనాలన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలు ప్రతిఒక్కరు చిత్తశుద్ధితో నిర్వహించాలన్నారు. వెల్ఫేర్‌ అధికారులు తమ ఫోన నెంబర్లను ఆయా హాస్టళ్లలో ప్రదర్శించాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ రామకృష్ణారెడ్డి, వివిశాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Sep 10 , 2024 | 07:15 AM